
రైతు సంఘాలు తలపెట్టిన ప్రజా భవన్ ముట్టడి లో భాగంగా గురువారం బి ఆర్ ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల హామీలు కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు బేషరతుగా రూ 2లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు పెట్టుబడి సహాయం కింద రైతు బందు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రతిపక్షాల సహకారంతో అడుగడుగునా ముట్టడిలో చేపడతామని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో గురజాల నారాయణరెడ్డి, రంగు రవీందర్ గౌడ్, పడగల శ్రీనివాస్, కాసర్ల రాజేందర్ ఉన్నారు.