నవతెలంగాణ – జక్రాన్ పల్లి
జిల్లా లంబాడి హక్కు పోరాట సమితి నాయకులను జక్రాన్ పల్లి పోలీసులు ముందస్తు అరెస్టు చేశారని లంబాడి హక్కుల పోరాట సంఘం జిల్లా అధ్యక్షుడు చౌహాన్ మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గ గిరిజన లంబాడీల భూములను ఫార్మ కంపెనీల పేరుతో నిర్బంధంగా గుంజుకోడాన్ని లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చలో కోడంగల్ పిలుపునిచ్చిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు చౌహాన్ మోహన్ నాయక్ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి చిన్య నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు విఠల్ నాయక్,రాష్ట కార్వ్యదర్శి రవీందర్, అలాగే విద్యార్థి సంఘం నాయకుడు జేత్రం నాయక్ ని ముందస్తుగా పోలీసులు అరెస్టు చేయడం జరిగిందన్నారు. అలాగే అర్ధరాత్రి రాష్ట్రవ్యాప్తంగా ఎల్ హెచ్ పి ఎస్ నాయకులను అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ బేషరతుగా వారిని విడుదల చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడీల భూములను గుంజుకోవడం అక్రమంగా ముమ్మాటికి లంబాడీల హక్కులను కాలరాయడమేనని రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో లంబాడీలకు రక్షణ లేకుండా పోయిందని, అరెస్ట్ చేసిన లంబాడి రైతులను వెంటనే విడుదల చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నామని తెలిపారు.