మాజీ సర్పంచుల ముందస్తు అరెస్టులు హేయమైన చర్య ..

Early arrest of ex-serpents is a heinous act..– సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు గడ్డం అరుణ 

నవతెలంగాణ – తాడ్వాయి 
ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్, రేవంత్ సర్కార్ ఉదయం నాలుగు గంటలకే మాజీ సర్పంచ్లను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో బంధించడం హేయమైన చర్య అని సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు గడ్డం అరుణ అన్నారు. సోమవారం పోలీస్ స్టేషన్లో, విలేకరులతో మాట్లాడుతూ మాజీ సర్పంచుల అక్రమ అరెస్టులను బిఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. 10 నెలల కింద అప్పులు తెచ్చి పనులు చేసిన వాటికి బిల్లులు అడిగితే అక్రమంగా అరెస్టు చేస్తున్నారని అన్నారు. ప్రజలకు పనిచేసిన దానికే డబ్బులు ఇవ్వమంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఇంత కోపం వచ్చిందని ప్రశ్నించారు. చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు డబ్బులు ఉండవు.. పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం బిల్లులు చెల్లించేందుకు డబ్బులు ఉంటాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బిల్లులు చెల్లింపు చేయకుండా సర్పంచులను ప్రభుత్వం వేధిస్తుంది, భయపెడుతుందని విమర్శించారు. ఇప్పటికే గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని పారిశుద్ధ్యం పడకేసిందన్నారు. అరెస్టు చేసిన మాజీ సర్పంచ్లను వెంటనే విడుదల చేయాలని, వెంటనే అప్పులు తెచ్చి పనులు చేసిన సర్పంచులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు జాజ చంద్రం, గుర్రం రమా సమ్మిరెడ్డి, గొంది శ్రీధర్, చిడం బాబురావు, పుల్లూరి గౌరమ్మ, గౌరవమైన నాగేశ్వరరావు, నూశెట్టి సరితా రమేష్, వట్టం సావిత్రి తదితరులు పాల్గొన్నారు.