వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

నవతెలంగాణ – తుర్కపల్లి 
వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మండల స్పెషల్ ఆఫీసర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జినుకల శ్యాంసుందర్ అన్నారు.గురువారం తుర్కపల్లి మండలం వెంకటాపురం, వేల్పుపల్లి, గుజ్జవానికుంట తండా, మోతిరామ్ తండాలో పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి సమస్యపై గ్రామస్తులతో చర్చించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. మిషన్ భగీరథ వాటర్ సప్లై తగ్గినచో ,  గ్రామంలో ఉన్న గ్రామపంచాయతీకి సంబంధించిన బోర్ వాటర్ నుండి అందరికీ సరఫరా చేయడం జరుగుతుంది. గ్రామాల్లో నీటి సరఫరా సక్రమముగా చేయుచున్నారా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో రానున్న రోజులలో నీటి సమస్య ఏర్పడితే ముందస్తు చర్యలకు గాను వ్యవసాయ బోర్లను అద్దె ప్రాతిపాదికన  తీసుకొనుటకు, అందుకు సంబంధించిన రైతులను గుర్తించడం జరుగినది. మోతీరాం తండాలో నీటి సమస్య లేకుండా చేయుట కొరకు ధర్మానాయక్ రైతు వద్ద బోరును అద్దెకు తీసుకోవడం జరిగింది. వ్యవసాయ బోరు నుండి  ట్యాంక్ వరకు పైప్ లైన్ వేయించడం జరిగిందని అన్నారు.  ప్రతిరోజు సరఫరా చేయు నీటిలో క్లోరినేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. క్లోరోస్కోప్ ద్వారా క్లోరినేషన్ చేసిన నీటిని పరిశీలించడం జరుగుతుందని అని తెలిపారు. ప్రతి మాసం 1వ, 11వ, 21వ తేదీల్లో ట్యాంకులను శుభ్రం చేయవలసిందిగా పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.  ఈరోజు గ్రామంలో ట్యాంకును శుభ్రం చేసినారు. పదివేల లీటర్ల నీళ్లకు 40 గ్రాముల చొప్పున  బ్లీచింగ్ పౌడర్ ను కలిపి క్లోరినేషన్ చేసి నీటిని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. మండలంలో ఏ గ్రామంలోనైనా నీటి సమస్య వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉండాలని ముందస్తుగానే గుర్తించి తగు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మెహర్ సాయి, పంచాయతీ కార్యదర్శులు, పాల్గొన్నారు.