నవతెలంగాణ-ముత్తారం: మండలంలోని ఓడేడు గ్రామానికి చెందిన రైతులు, రైతు కూలీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచర్ల గ్రామానికి చెందిన కూలీలతో 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ముందస్తు నూతన సంవత్సర వేడుకలను మంగళవారం జరు పుకున్నారు. ఓడేడు గ్రామంలోని మల్లన్న దేవాలయం ప్రాంగణంలో గల వ్యవసాయ క్షేత్రంలో ఈ సందర్భంగా కేక్ కట్చే సి వేడుకలను జరుపుకొని ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమoలో రైతులు కందుల ఓదెలు, దాసరి రాజు గౌడ్, బండారి రాజు, పల్లెర్ల రమేష్ గౌడ్తో పాటు రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు.