దాచారంలో ముందస్తుగా ముగ్గుల పోటీలు..

నవతెలంగాణ-బెజ్జంకి 
మండల పరిధిలోని దాచారం గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బీజేపీ మండలాధ్యక్షుడు,ఎంపీటీసీ కొలిపాక రాజు అధ్వర్యంలో ముందస్తుగా ముగ్గుల పోటీలు అదివారం రామాలయం వద్ద నిర్వహించారు.సుమారు 55 మంది మహిళలు ఉత్సహకంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు.ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన మహిళలతో పాటు పోటీల్లో పాల్గొన్న వారికి ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, అజయ్ వర్మ, పోతుగంటి సుజాత రెడ్డి బహుమతులందజేశారు. బీజేపీ దళిత మోర్చ జిల్లాద్యక్షుడు దీటీ రాజు,గ్రామ నాయకులు హజరయ్యారు.