– 3-నిమిషాల ఎపిసోడిక్ క్యాప్సూల్స్ తో వీక్షకులను నిమగ్నం చేసే తాజా శకాన్ని ప్రారంభించిన ఛానెల్
నవతెలంగాణ – హైదరాబాద్: ఆకర్షణీయమైన కథా కథనం వైపు ఒక ముఖ్యమైన పురోగతిలో, సోనీ బీబీసీ ఎర్త్ తన మార్క్యూ ప్రాపర్టీ ‘ఎర్త్ ఛాంపియన్స్’ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌గా ప్రారంభమైన ఎర్త్ ఛాంపియన్స్ ఇప్పుడు వీక్షకులను ఆసక్తికరమైన 3-నిమిషాల క్యాప్సూల్స్ గా ప్రేరేపిస్తుంది, ప్రకృతి కాలిడోస్కోప్ ద్వారా అసాధారణమైన సముద్రయానంలో వారిని తనతో తీసుకెళ్తుంది. ఇది నవంబర్ 6, 2023న ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. జీవితపు అన్ని వర్గాలకు చెందిన సాధారణ పౌరులకు ప్రకృతి ఔత్సాహికుల కథలను వివరిస్తూ, ‘ఎర్త్ ఛాంపి యన్స్’ సమష్టిగా సానుకూల మార్పు శక్తిగా మారే వ్యక్తిగత చర్యల అద్భుతమైన శక్తిపై వెలుగునిస్తుది. వ్యక్తిగత, గృహ లేదా సమాజ స్థాయిలో అటవీ పునరుద్ధరణ, వ్యర్థాల నిర్వహణ, నీరు, గాలి శుద్దీకరణ మొద లైన సమస్యలను పరిష్కరించే నిజజీవిత హీరోలను ప్రతి నెలా గౌరవిస్తూ, వేడుక చేయడమే సోనీ బీబీసీ ఎర్త్ లక్ష్యం. సోషల్ మీడియాలో ప్రమోషన్‌లతో ఆన్-ఎయిర్ ప్రాపర్టీగా ప్యాక్ చేయబడిన సోనీ బీబీసీ ఎర్త్ యొక్క ఎర్త్ ఛాంపియన్స్ తగిన సంగీతంతో ముడిపడి ఉన్న పటిష్ఠమైన స్క్రిప్ట్ తో చమత్కార భరితంగా రూపుదిద్దుకుంది. ఎర్త్ ఛాంపియన్స్ ప్రారంభ ఎపిసోడ్‌లో శ్రీ జాదవ్ పాయెంగ్ ను చూడవచ్చు. ఆయననే ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. అస్సాంకు చెందిన శ్రీ పాయెంగ్ బంజరు భూములను అభివృద్ధి చెందుతు న్న మానవ నిర్మిత అడవిగా మార్చారు. తన నిస్వార్థ, అవిశ్రాంత ప్రయత్నాలకు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును కూడా పొందారు. బ్లూ ప్లానెట్ II, క్లైమేట్ చేంజ్: ది ఫ్యాక్ట్స్ మరియు ఎ పర్ఫెక్ట్ ప్లానెట్ వంటి తన ల్యాండ్‌మార్క్ షోల ద్వారా సోనీ బీబీసీ ఎర్త్ దేశవ్యాప్తంగా ఉన్న వీక్షకులను ఏకం చేసింది. ఇది సహజ ప్రపంచంతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంది. ఛానెల్ తన వివిధ కార్యక్రమాల ద్వారా సుస్థిరత్వం యొక్క ఆవశ్యకత గురించి అవగాహనను పెంచుతోంది. ఈ భావనను విశ్వసించే కమ్యూనిటీని నిర్మిస్తోంది.
వ్యాఖ్యలు: రోహన్ జైన్, బిజినెస్ ఆపరేషన్స్ హెడ్ – సోనీ AATH మరియు హెడ్ – మార్కెటింగ్ & ఇన్‌సైట్స్, ఇంగ్లీష్ క్లస్టర్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా. “ఎర్త్ ఛాంపియన్స్ తో, తమ పర్యావరణ-స్నేహపూర్వక చర్యల తీవ్ర ప్రభావాన్ని ప్రదర్శించడానికి వ్యక్తులు, కమ్యూనిటీలకు సాధికారత కల్పించడాన్ని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ అసాధారణ కార్యక్రమం ద్వారా, పచ్చదనం, మరింత సుస్థిరమైన భవిష్యత్తు వైపు చేసే ఉల్లాసకరమైన ప్రయాణంలో మాతో చేరాలని దేశ వ్యాప్తంగా మేం ప్రజలను ఆహ్వానిస్తున్నాం. మనమంతా కలిసి ఒక వైవిధ్యాన్ని సృష్టించగలం మరియు రాబో యే తరాలకు వారసత్వాన్ని సృష్టించగలం.”
జాదవ్ పాయెంగ్, అటవీ పెంపకం ధీరుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ‘ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’.
“సోనీ బిబిసి ఎర్త్ యొక్క ఎర్త్ ఛాంపియన్స్ లో భాగమైనందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఇది ప్రజలను ప్రేరేపించే మరియు వారిలో పర్యావరణ స్పృహను రేకెత్తించే గొప్ప చొరవ. మన గ్రహానికి ప్రయోజనం చేకూ ర్చేలా దీర్ఘకాలిక ప్రభావం కనబరిచే సామూహిక చర్య శక్తిని సృష్టించడం పట్ల నా హృదయాన్ని ఆనందం, కృతజ్ఞతతో నిండుతోంది. “