‘పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి పైపులను ఉపయోగించాలి

– మట్టి పైపుల వినియోగానికి సీఎం ఎ.రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేయాలి
– తెలంగాణ ఎస్‌ డబ్ల్యూజీ పైప్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ అసోసియేషన్‌
నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎస్‌ డబ్ల్యూజీ ( డ్రయినేజీ) మట్టి పైపులను వినియోగించాలని, అందుకు సీఎం ఎ.రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేయాలని తెలం గాణ ఎస్‌ డబ్ల్యూజీ పైప్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ అసోసియే షన్‌ కోరింది.ఆదివారం బషీర్‌ బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్‌ అధ్యక్షులు పి.వరప్రసాదరావు మాట్లాడుతూ నిజాం ప్రభుత్వ కాలం లో ఉపయోగించిన ఈ మట్టిపైపులు నేటికి నిరా టంకంగా 150 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాయని, ఎలాంటి కెమికల్‌ ప్రభావం లేదని, పైపుల లీకేజీ ఉం డదని, ఆరోగ్య రీత్యా మేలు చేస్తాయన్నారు.రాష్ట్రంలో ఉన్న ఈ మట్టి పైపులు ఏ రాష్ట్రంలో లేవని, తెలంగాణలో 36 పరిశ్రమలు ఉన్నాయని, నాలుగు వేల మంది కార్మికులు పని చేస్తున్నారని, ఈ పైపులు 65 శాతం సిలికా, 25 శాతం అల్యూమినియం కలిగిన తెల్ల మట్టితో తయారు చేయబడతాయని, ఎలాంటి రసాయనాలు లేకుండా పూ ర్తిగా పర్యావరణానికి అనుకూలమైనవని, మల, మూత్రా లలో ఆమ్లం, క్షరాలు కలిగి ఉండి ఎలుకలు, పందికొ క్కు లు,చెదలు నివారణకు ఎంతో ఉపయోగప డతాయన్నా రు.క్షీణిస్తున్న జీవావరణం గురించి ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతుందని, పర్యావరణానికి వంద శాతం అనుకూలమైన ఎస్‌ డబ్ల్యూజీ పైపులు వాడించి పరిశ్ర మలను ప్రోత్సహించాలని ఆయన సీఎం ఎ.రేవంత్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం ప్రభుత్వం అన్ని జీహెచ్‌ ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌ ఈబీ, గ్రామ పంచా యితీలు, డీటీపీసీ లే అవుట్లలో ఈ పైపులను మాత్రమే వినియోగిం చాలని అందుకు రాష్ట్ర సీఎం ఆదేశాలు జారీ చేయాలని కోరారు.ఈ సమావేశంలో అసోసియేషన్‌ నాయ కులు వినోద్‌ రెడ్డి, మధుసూదన్‌, భూమయ్య గుప్త పాల్గొన్నారు.