శ్రీలంకలో భూ ప్రకంపనలు

Earthquakes in Sri Lanka–  హిందూ మహా సముద్రంలో భూకంపం
కొలంబో : హిందూ మహా సముద్రంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 6.2గా నమోదైంది. వీటి ప్రభావంతో కొలంబోలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయని జాతీయ భూకంపాల కేంద్రం (ఎన్‌సిఎస్‌) ఎక్స్‌లో పోస్టు పెట్టింది. మధ్యాహ్నం 12.30గంటల సమయంలో భూమి తీవ్రంగా కంపించిందని, సముద్రంలో శ్రీలంకకు ఆగేయంగా 800కిలోమీటర్ల దూరంలో, 10కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం వుందని ఎన్‌సిఎస్‌ తెలిపింది. శ్రీలంకకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులను ఉటంకిస్తూ స్థానిక మీడియా పేర్కొంది. ఉత్తర సుమత్రా దీవులకు 1295 కిలోమీటర్ల దూరంలో భూ కంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే (యుఎస్‌జిఎస్‌) తెలిపింది.