మట్టి వాసన పుస్తకావిష్కరణ

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
అఫ్జల్ గంజ్ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం ఆవరణలో గల రిజిస్టర్ ఆఫ్ పబ్లికేషన్ రాష్ట్ర కార్యాలయంలో  సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎడవల్లి నాగరాజు రచించిన మట్టి వాసన (నా కవితలు) పుస్తకాన్ని ఆవిష్కరించిన రిజిస్టార్ ఆఫ్ పబ్లికేషన్ డిప్యూటీ రిజిస్టర్ చంద్రకళ, రీడర్ గ్రేడ్ వన్ ఆఫీసర్ కేసరి హనుమాన్ లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొన్ని పుస్తకాలను రిజిస్టర్ ఆఫ్ పబ్లికేషన్ కు రచయిత అందజేశారు. ఈ కార్యక్రమంలో యడవల్లి లలిత తదితరులు పాల్గొన్నారు.