బండికి వెసులుబాటు

– అరెస్ట్‌ చేయొద్దని హైకోర్ట్‌ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ ను అరెస్ట్‌ చేయొద్దని పోలీసులకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సంజయ్ సహా ఇతర పిటిషనర్లకు సీఆర్‌సీపీ ప్రకారం 41ఏ నోటీసులు జారీ చేశాకే వారిపై ఉన్న కేసులను విచారణ చేయాలని ఆదేశించింది. హౌళీ సందర్భంగా జరిగిన ఘర్షణ నేపథ్యంలో చెంగిచర్ల వెళితే తనపై రాజకీయ ప్రేరేపితంగా తప్పుడు కేసు పెట్టారని, ఉప్పల్‌, మేడిపల్లిలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టి వేయాలని సంజరుతో సహా ఆరుగు రు పిటిషన్లు వేశారు. వీటిని జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ బుధవారంవిచారణ చేపట్టారు.వాదనల తర్వాత హైకోర్టు…. సంజరు, ఇతర పిటిషనర్లను అరెస్టు చేయవద్దని ఆదేశిస్తూ, విచారణను జూన్‌ 11కు వాయిదా వేసింది.