సులభంగా జీర్ణమయ్యే పదార్థాలు

మన జీర్ణవ్యవస్థ చాలా అధునాతనమైనది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సంక్లిష్ట మార్గాల్లో పనిచేస్తుంది. అయినప్పటికీ, మన జీర్ణవ్యవస్థ యొక్క కార్యాచరణ పరిమిత సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఫైబర్‌, కొవ్వు తక్కువగా ఉన్న ఆహారాలు సులభంగా జీర్ణమవుతాయి. సులభంగా జీర్ణం అయ్యే పదార్థాలు… టోస్ట్‌, వైట్‌ రైస్‌, అరటిపండ్లు, గుడ్లు, చిలగడదుంపలు, చికెన్‌, సాల్మన్‌ ఫిష్‌, కీర, క్యారెట్‌, ఆకు కూరలు, వెజిటబుల్స్‌, పెరుగు.
చిలగడ దుంపలు (మోరం గడ్డలు): కరగని ఫైబర్‌తో పోలిస్తే ఇవి సులభంగా జీర్ణమవుతాయి. ఇవి పేగులలో మంచి బాక్టీరియాను వృద్ధి చేసి, జీర్ణ శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా, చిలగడదుంపలలో పొటాషియం ఉంటుంది. ఇది సహజ ఎలక్ట్రోలైట్‌.
సూప్‌ : సూప్‌ aజూజూవ్‌ఱ్‌వ ని పెంచడమే కాకుండా జీర్ణవ్యవస్థను కూడా శాంతపరుస్తుంది. సులభంగా జీర్ణమయ్యే రూపంలో కూరగాయలు లేదా చికెన్‌ వంటి ఆహారాన్ని తీసుకోవడానికి సూప్‌ మంచి మార్గం. పదార్థాలను కలిపి ఉడికించడం వల్ల వాటిని సులభంగా జీర్ణం చేస్తాయి.
లీన్‌ మాంసం : మాంసాహారులకు లీన్‌ మీట్‌ సులభంగా జీర్ణమయ్యే ఆహారం. మాంసం, చికెన్‌, చేపలు ప్రోటీన్‌ కలిగి ఉంటాయి. జీరో ఫైబర్‌తో పాటు తక్కువ కొవ్వు పదార్ధం ఉంటాయి. మాంసాన్ని మన శరీరం సులభంగా జీర్ణం చేస్తుంది. ఇది సమద్దిగా పోషకాహారాన్ని అందిస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు
ఉడికించిన పండ్లు, కూరగాయలు : చాలా పండ్లు, కూరగాయలలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. వీటిని ఉడికించినప్పటి కంటే పచ్చిగా తిన్నప్పుడే సులభంగా జీర్ణమవుతుంది. కాబట్టి పచ్చి క్యారెట్‌ తినడానికి ప్రయత్నించండి.
గుడ్లు : తెల్లసొన, పచ్చసొన రెండూ సులభంగా జీర్ణమవుతాయి. గుడ్లు ఒక పోషక శక్తి కేంద్రంగా జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉడికించిన గుడ్లు తినడమే మంచిది.
పెరుగు : పెరుగు ఆరోగ్యకరమైనది. lactose intolerance తో బాధపడేవారికి కూడా సులభంగా జీర్ణమవుతుంది. ఆరోగ్యకరమైన బాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ఆరోగ్యాన్ని ఆప్టిమైజ్‌ చేయడమే కాకుండా, లాక్టోస్‌ చక్కెరను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. జీర్ణం చేయడం సులభం చేస్తుంది. డైరీ ప్రొడక్ట్స్‌ తరచుగా జీర్ణ సమస్యలకు దారి తీస్తున్నప్పుడు పెరుగును మన ఆహార జాబితా నుండి మినహాయించవచ్చు.
-పి.వాణి, 9959361180