అమెజాన్‌లో ఎంఎస్‌ఎంఇకు సులభ రిజిస్ట్రేషన్‌

న్యూఢిల్లీ : ఎంఎస్‌ఎంఇ దినోత్సవం సందర్బంగా ఆ రంగ సంస్థలకు సరళీకృత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పరిచయం చేసినట్లు అమెజాన్‌ ఇండియా తెలిపింది. ఈ కార్యక్రమంలో 2025 నాటికి కోటి విక్రేతలను డిజిటలైజ్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. కేవలం స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి తమ విక్రయాల ప్రయాణాన్ని ప్రారంభించేందుకు వీలు కల్పిస్తోన్నట్లు తెలిపింది. ప్రస్తుతం తమ వేదికపై 12 లక్షల పైగా విక్రేతలు ఉన్నారని వెల్లడించింది.