
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
గర్భిణీలు బాలింతలు పిల్లలు, కిశోర పిల్లలు పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకొని నిత్య జీవితంలో భాగ ఎదగాలని సీడీపీఓ జయమ్మ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ మండలంలోని నాగారం గ్రామంలో అంగన్ వాడి సెంటర్ లో అన్న ప్రసన్న కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా సిడిపిఓ జయమ్మ మాట్లాడుతూ బాల బాలికల్లో రక్తహీనత లోపాన్ని నివారించడానికి ఆకుకూరలు, ఐరన్ చాలా ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి అంగన్ వాడి కేంద్రంలో పోషక పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం పోషణ పక్షం 2024 ప్రతిపాదిత థీమ్ లు, పోషణ్ భీ, పడాయి భీ (పిబిపిబి) సాంప్రదాయ, ప్రాంతీయ, స్థానిక ఆహార పద్ధతులు పోషకాహా రం పై అవగాహన చేపట్టేమన్నారు.గర్భిణీల ఆరోగ్యం,శిశు, చిన్న పిల్లల ఆహార (ఐవైసిఎఫ్) ఆచరణలు పోషకాహార సూచికలను చేస్తున్నామన్నారు. ఆరోగ్యంగా ఉండడానికి చిరుధాన్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని సూచించారు. ఆధునిక ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు మంచి ఆహారానికి దూర మవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమం లో సూపర్ వేజర్ కవిత, పోషణ అభియాన్ బ్లాక్ కో ఆర్డినేటర్ కిరణ్ , పొట్లపల్లి సెక్టార్ అంగన్ వాడి టీచర్, ఆయాలు, ఆశ కార్యకర్తలు, లబ్దిదా రులు, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.