అంగన్వాడి కేంద్రంలో ఈసీసీఈ డే..

ECCE Day at Anganwadi Centre..నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని కోన సముందర్ అంగన్వాడి కేంద్రంలో  శనివారం పూర్వ బాల్య దశ సంరక్షణ, విద్య( ఎర్లీ చైల్డ్ హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్) దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రానికి విచ్చేసిన తల్లిదండ్రులకు చిన్నారుల ప్రతిభను గురించి వివరించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ ఎం.లక్ష్మి మాట్లాడుతూ 2030 సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్య, పిల్లల సమగ్ర అభివృద్ధి, సంరక్షణ అందరికీ సాధ్యమైనంత తొందరగా అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. తద్వారా చిన్నారులు ఒకటవ తరగతిలో చేరేందుకు సిద్ధంగా ఉంటారన్నారు. అన్ని అభివృద్ధి క్షేత్రాలతో గరిష్ట ఫలితాలను సాధించడమే పూర్వ బాల్య దశ సంరక్షణ, విద్య( ఈసీసీఈ) యొక్క సమగ్ర లక్ష్యం అన్నారు. అనంతరం అంగన్వాడి కేంద్రం చిన్నారులను ఆకర్షించేలా రకరకాల బొమ్మలు వస్తువులతో అలంకరించారు. కార్యక్రమంలో ఆయమ్మ  శారద, చిన్నారుల తల్లులు పత్రి యశోద, సబ్బాని బాలమణి, పత్రి అనిత,ఆరేపల్లి సరిత, సూర శృతి, గమ్మత్ యమునా, కల్ల వనజ, మల్లెల శంకరమ్మ, తదితరులు  పాల్గొన్నారు.