నవతెలంగాణ నాగిరెడ్డిపేట్: నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టును గురువారం రోజు ఈకో ఫారెస్ట్ అధికారి రజినీ నాయక్ పరిశీలించారు. ప్రాజెక్ట్ పోచారం ప్రాజెక్టుతో పాటు అతిధి గృహాలను ప్రాజెక్టు పరిసరాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోచారం ప్రాజెక్టును అభివృద్ధి పరచటానికి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయడానికి పరిశీలించినట్లు వారు పేర్కొన్నారు. పర్యటకశాఖ తమకు పోచారం ప్రాజెక్టును అప్పగిస్తే టూరిజంగా అభివృద్ధి చేస్తామని వారు పేర్కొన్నారు. వారి వెంట డి ఈ ఈ వెంకటేశ్వర్లు మెదక్ జిల్లా అటవీశాఖ అధికారులు ఉన్నారు.