ముంబయి: విద్యుత్ వాహనాలు, సోలార్ రంగాల్లోని చిన్న, మధ్యతరహా సంస్థలకు రుణాలు అందించే ఎకోఫి తాజాగా మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయినా మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ (ఎంఎల్‌ఎంఎంఎల్)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. దీంతో విద్యుత్ త్రిచక్ర వాహనాలకు వినూత్న ఫైనాన్సీంగ్ సొల్యూషన్స్‌ను అందించనున్నట్లు పేర్కొంది. ఈ రంగంలో పెరుగుతున్న ఇవి త్రిచక్ర వాహనాల డిమాండ్‌కు ప్రోత్సాహాన్ని అందించాలని నిర్దేశించుకున్నట్లు ఎకోఫీ సహ వ్యవస్థాపకులు, సిఇఒ రాజశ్రీ నంబియర్ పేర్కొన్నారు. దేశంలో ఇవి త్రిచక్ర వాహనాల వినియోగాన్ని పెంచడం తమ భాగస్వామ్య ఉద్దేశ్యమని ఎంఎల్‌ఎంఎంఎల్ సిఇఒ సుమన్ మిశ్రా తెలిపారు.