నవతెలంగాణ – గోవిందరావుపేట
ఎస్సీ సామాజిక వర్గం మాల మాదిగలకు ఉపకులాల వారికి ఎస్సీ కార్పొరేషన్ నిధుల ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గణపాక సుధాకర్ అన్నారు. గురువారం ములుగు జిల్లా ఎస్సి కార్పొరేషన్ ఉన్నతాది కారి ఈ డి తుల రవి ని, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గనపాక సుధాకర్ మర్యాద పూర్వంగా కలిసి షాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ సందర్భంగా గనపాక సుధాకర్ మాట్లాడుతు ఎస్సి సామజిక వర్గం మాల, మాదిగలకు, ఉపకులాలవారికి ఎస్సి కార్పొరేషన్ నిధుల ద్వారా అన్ని కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి పార్చాలని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడుగు బలహీనుల పార్టీ అని అదేవిదంగాకాంగ్రెస్ ప్రజా పాలనాలో ప్రజలు సుఖ శాంతులతో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారని ఆశాభవాన్ని వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శి ఓరుగంటి అనీల్,మాదారపు రాజు జిల్లా సీనియర్ నాయకులు, పెండ్యాల రామస్వామి సీనియర్ నాయకులు, ఓరుగంటి కృష్ణ ములుగు పట్టణ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.