ప్రాంతీయం నుంచి అంతర్జాతీయం వరకు నిర్దిష్ట సంవ త్సరకాలంలో పేదరిక స్థాయిని ట్రాక్ చేయడానికి, ఆకలి తీరు తెన్నులు కొలవడానికి ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్‌ఐ) అనేది ఒక ముఖ్యమైన సాధనంగా పరిగణిస్తారు. విలువ, నాణ్యత, వాస్తవికత, అంతర్జాతీయ సంస్థల గణాంకాల ప్రామాణికత వంటి శాస్త్రీయ ప్రమాణాలతో నిర్ధారించబడిన ”గ్లోబల్ హంగర్ ఇండెక్స్” నివేదిక ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ప్రంపచవ్యాప్తంగా ఆకలిని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలనేదే ఈ నివేదిక లక్ష్యం.
ఆహారం సరిపడినంతగా దొరకకపోవడం, మొత్తం జనా భాలో పోషకాహార లేమితో ఉన్న జనాభా ప్రాతి పదికన నిర్ధా రించే పోషకాహార లోపం (అండర్ నరిష్‌మెంట్), ఐదేండ్ల పిల్లల్లో ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం (చైల్డ్ స్టన్‌టింగ్), వారికి తీవ్ర మైన పోషకాహారలేమి వల్ల వయసుకు తగిన ఎత్తు లేకపోవడం (చైల్డ్ వాస్టింగ్), సరిపడా పోషకాహారలేమి వలన, అనారోగ్య మైన వాతావరణం వలన జరుగుతున్న శిశు మరణాలు (చైల్డ్ మోర్టాలిటి) వంటి నాలుగు కీలక సూచికలను కొలమానంగా పరిగణనలోకి తీసుకుని ‘ప్రపంచ ఆకలి సూచీ’ (జీహెచ్‌ఐ)ని లెక్కిస్తారు. వెయిటేజ్ పరంగా విశ్లేషించినపుడు, హంగర్ ఇండెక్స్‌లో పోషకాహారలోపానికి 1/3, చైల్డ్ స్టన్‌టింగ్‌కు 1/6, చైల్డ్ వాస్టింగ్‌కు 1/6, శిశు మరణాలకు 1/3 వంతుగా ఇమిడి ఉంటుంది.
ఆకలి సూచి తీవ్రతను 100పాయింట్ల స్కేలు ప్రాతిపదికన నిర్ధారిస్తారు. స్కేలులో స్కోరు ‘0’ వుంటే ఆకలి లేని పరిస్థితులు, ‘100’ వుంటే ఘోరమైన పరిస్థితులు నెలకొనివున్నట్లుగా భావి స్తారు. ఈ స్కోరు 9.9 లేదా అంత కంటే తక్కువ వుంటే ‘తక్కు వగా’ ఉందని, 10-19.9 మధ్య ఉంటే ‘మోస్తరుగా’ వుందని, 20-34.9 మధ్య వుంటే ‘తీవ్రంగా’ ఉందని, 35-49.9 ఉంటే ‘ఆందోళనకరమని’ 50 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ నమోదైతే ‘అత్యంత ఆందోళనకరమని’ నిర్ధారిస్తారు.
ఐర్లాండ్‌కు చెందిన ‘కన్‌సర్న్ వరల్డ్‌వైడ్’, జర్మనీకు చెందిన ‘వెల్త్ హంగర్ లైఫ్’ సంయుక్తంగా వివిధ గణాంకాల సూక్ష్మ పరిశీలన అనంతరం, నిపుణుల సమూహంతో తయారుచేసి, 2006 నుంచి ప్రతియేటా ఈ నివేదికను విడుదల చేస్తున్నాయి. అక్టోబర్ 12, 2023న ఈ రెండు నాన్-గవర్నమెంట్ యూరో పియన్ ఆర్గనైజేషన్స్ ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్-2023’ను విడు దల చేశాయి. గణాంకాలకు సంబంధించిన వివరాలను ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, ఎఫ్‌ఏఓ, డిహెచ్‌ఎస్, యూఎన్‌ఐజిహెచ్‌ఇ వంటి అంతర్జా తీయంగా గుర్తింపు పొందిన సంస్థలు ప్రచురించిన నివేదికల ఆధారంగా పరిగణనలో తీసుకోబడినాయి. 125 దేశాలను పరిగణనలోకి తీసుకుంటే 28.7 హంగర్ స్కోరుతో భారతదేశం 111వ స్థానంలో నిలి చింది. గతేడాదితో పోలిస్తే మరొక నాలుగు స్థానాలకు దిగజారింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం ఆకలి ప్రమాదకర స్థాయిలో ఉన్న 40 దేశాల జాబి తాలో భారతదేశం చేరటం శోచనీయం.
మొత్తం 125 దేశాల జాబితాలో ఐదేండ్లలోపు పిల్లల్లో పోషకాహార లేమితో ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడమనే సూచిక (చైల్డ్ స్టన్‌టింగ్)లో 18.7శాతంగా నమోదై ప్రపం చంలోనే భారతదేశం అత్యధిక స్థాయిలో నిలవడం ఆందోళన కరం. పిల్లల పోషకాహారలేమికి సంబంధించిన అన్ని సూచిక లలో చైల్డ్ వాస్టింగ్ అనేది తీవ్రమై నదిగా పరిగణించ బడుతుంది. ఏదైనా దేశంలో ఇది 15శాతం కంటే ఎక్కువ వుంటే అత్యంత ఆందోళనకరమైన అంశంగా భావించబడుతుంది. చైల్డ్ వాస్టింగ్ సూచికలో 16.6శాతంగా నమోదై, పోషకాహారలోప తీవ్రతను ప్రతిబింబించింది. 35శాతం కంటే ఎక్కువ మంది పిల్లలు ఈ జాబితాలో ఉన్నారు. ఐదేండ్లలోపు శిశుమర ణాల రేటు 3.1శాతంగా నమోదయింది. 15-24 సంవత్సరాల యుక్త వయస్సు కలిగిన మహిళలలో రక్త హీనతకు సంబంధిం చిన సూచికలో ప్రపంచంలోనే అధికంగా భారతదేశంలో 58.1 శాతంగా ఉండడం ప్రమాద తీవ్రతకు సంకేతం.
ప్రపంచ ఆకలి సూచీలో భారతదేశం తర్వాత తైమూర్, ఆఫ్ఘ నిస్తాన్, హైతి, గునియా, లిబియా, కాంగో, సూడాన్, బురుండి, సోమాలియా, ఎమెన్, మడగాస్కర్, సెంట్రల్ ఆఫ్రికా వంటి 16 దేశాలు మాత్రమే ఉండడం గమనార్హం. భారతదేశానికి పొరు గుదేశాలైన పాకిస్తాన్ (102), బంగ్లాదేశ్ (81), నేపాల్ (69), శ్రీలంక (60) ర్యాంకులతో మనకంటే ముందు నిలిచాయి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం 9 దేశాలు అత్యంత ప్రమాదకర స్థాయిలోను, 34 దేశాలు ఆకలి తీవ్రతతోనూ ఉన్నాయి.
ఆకలిని తగ్గించే ప్రయత్నాలలో స్థబ్దత ఏర్పడిం దని, 2015 నాటి స్కోర్ 19.1శాతంగా వుండగా మధ్యలో కొంత మెరుగుదల సాధించినప్పటికీ, ఆకలి సూచీ పోకడలలో తీవ్రత పునరావృతమై తిరిగి 18.3శాతానికి చేరిందని, 2017 నుంచి పౌష్టికా హార లోపం ఉన్న ప్రజల సంఖ్య 572 మిలియన్ల నుంచి క్రమేపి పెరిగి షుమారు 735 మిలియన్ల స్థాయికి చేరిందని నివేదిక ఉటంకించింది. కరోనా మహమ్మారి, అంతర్జాతీయ సంఘర్షణలు, రష్యా- ఉక్రేయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు వంటి సవాళ్లు ఈ స్థబ్దకు కారణాలని అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికను భారత ప్రభుత్వం తిర స్కరించింది. ఇది ఆకలి లెక్కలలో లోప భూయిష్టమైన పద్ధతులను అవలంభించిందని అభివర్ణించింది. కేవలం మూడు వేల మంది నమూనాగా నిర్వహించిన సర్వేతో పౌష్టికాహార లోపాన్ని నిర్ధారించడం అర్థరహితమని ఆరోపించింది. మహిళా- శిశు సంక్షేమ శాఖ, నివేదికలోని మూల్యాంకన పద్ధతిలో తీవ్ర లోపాలున్నాయని, మొత్తం నాలుగు సూచికలలో మూడు పిల్లల ఆరోగ్యానికి సంబంధించినవని, ఇది మొత్తం జనాభాకు ప్రాతినిధ్యం కాదని పేర్కొంది. నివేదిక విశ్వసనీయత ప్రశ్నా ర్థకంగా ఉందని, ప్రభుత్వ పోషణ్ ట్రాకర్ ప్రకారం చైల్డ్ వాస్టిం గ్‌కు సంబంధించి 7.2శాతంఉండగా జీహెచ్‌ఐ నివేదిక ఇచ్చిన గణాంకాలలో 18.7శాతంగా చూపారని విమర్శించింది.
ప్రభుత్వ విమర్శలను నిశితంగా విశ్లేషిస్తే వాటి వాదనలలో పసలేదనేది ప్రస్ఫుటమవుతోంది. ప్రభుత్వం తానిచ్చిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-2021కి సంబంధించి ఇచ్చిన గణాంకాలలో చైల్డ్ వాస్టింగ్ 19.3శాతంగా, చైల్డ్ స్టన్‌టింగ్ 35.5 శాతంగా ఉంది. ూఉఖీ×-2023 నివేదిక ప్రకారం కూడా భారతదేశంలో 24 కోట్లమంది ప్రజలు పోషకాహారలేమితో ఉన్నారని తెల్పింది. ఫుడ్ సెక్యూరిటీ అండ్ నూట్రిషన్ ప్రపంచ నివేదిక-2023లో కూడా ఇది 16.6 శాతంగా ఉన్నది.
ప్రజలకు ఆహారాన్ని హక్కుగా అందించే కృషిలో భాగంగా ‘ఈట్ రైట్’, రక్తహీనత, పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ‘పోషణ్’, ప్రసూతి సమయంలో ప్రయోజనాలను అందించేం దుకు ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలను లబ్దిదారులకు అందించేందుకు నిర్ధేశించిన ‘జాతీయ ఆహార భద్రతా చట్టం’, రెండేండ్లలోపు శిశువుల పరిరక్షణకు ‘ఇంద్రప్రస్థ’, బడిపిల్లలకు ‘మధ్యాహ్న భోజన పథకం’, ఆహార ధాన్యాల సరఫరాకు సంబంధించి ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ వంటి వివిధ పథకాలు, కార్యక్ర మాలు, చర్యల ద్వారా ఆకలిని తగ్గించి, పోషకాహాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రచారార్భ టంలోని డొల్లతనాన్ని ప్రపంచ ఆకలి సూచీలో భారతదేశ స్థానం బహిర్గతం చేసింది.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లెక్కించడానికి ప్రాతిపదికగా ఉన్న నాలుగు సూచికలు ఐక్యరాజ్య సమితి లక్ష్యాలుగా పెట్టుకున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీ)లో భాగమనేది విస్మరించ లేము. ప్రపంచ ఆకలి సూచీ లెక్కించే పద్ధతి కూడా ప్రపంచ దేశాలతో ఆమోదించబడి కాలపరీక్షకు నిలిచిందనేది గమనార్హం. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వివిధ కీలక సూచికలు భారతదేశంలో నెలకొనిన్న ఆకలి తీవ్రతను పోషకాహార లేమిని, పొంచిఉన్న సవాళ్ళను పాలకుల ముందుంచాయి. దేశ ప్రజల భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా పోషకాహార లోపాన్ని సరిచేసు కోవాల్సిన ఆవశ్యకతను ఈ నివేదిక నిక్కచ్చిగా వెలిబుచ్చింది. నివేదికలో వెలుగుచూసిన లోపాలను సరిచేసుకునే ప్రయత్నానికి బదులు గా నివేదికను తిరస్కరించటం ప్రభుత్వ అసహనానికి అద్దం పడుతోంది.
సామాజిక-ఆర్థిక తారతమ్యాలు, ప్రబలిపోయిన పేదరికం, తగినంత ఆహారాన్ని తీసుకోలేకపోవడం, పోషక విలువలున్న ఆహారం అందుబాటులో లేకపోవడం, ఆరోగ్య పరిరక్షణా కొరత, లోపభూయిష్టమైన వ్యవసాయ పద్ధతులు, ఆహార పంపిణీ విధానాలు, లింగ అసమానతలు వంటివి ప్రపంచ ఆకలి సూచి లో భారతదేశ స్థానాన్ని దిగజార్చడానికి తీవ్ర ప్రభావాన్ని చూపిన అంశాలని పాలకులు గమనించి, సార్వజనీయ ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి ప్రత్యామ్నాయ విధానా లను రూపొందించి అమలుచేయాల్సిన తరుణమిది.
జి.కిషోర్ కుమార్
9440905501
ఆర్థిక వృద్ధి అంకెలలో కాదు – ఆకలి తీర్చడంలో రావాలి
10:13 pm