అర్థశాస్త్ర పరిశోధనలే దేశ ఆర్థిక ప్రగతికి మూలాధారని అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఏ పున్నయ్య పేర్కొన్నారు.అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం దత్తాంశ సేకరణ అనువర్తనీయత అనే అంశాపై తెలంగాణ యూనివర్సిటీ లోని ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో చర్చ కార్యక్రమాన్ని డాక్టర్ పున్నయ్య ప్రారంభించారు. మోడరేటర్స్ గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ న్యానేశ్వర్, వెంకటేశ్ లు పాల్గొని ప్రామాణికమైన దత్తాంశం తోనే వాస్తవ ఫలితాలు వస్తాయని, దత్తాంశ సేకరణకు నిబద్ధతతో ప్రశ్నావళిని రూపొందించుకో వాలన్నారు. దేశ వ్యాపితంగా వన్ నేషన్ వన్ రేషన్ అనే నినాదంతో ప్రజా పంపిణీ పథకాన్ని ముందుకు తీసుకుపోవాలని ప్రధానమంత్రి ప్రకటించిన సందర్భంగా ఒక సర్వేను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆధార్ బేస్ గా జరిగే రేషన్ కార్డు కన్వర్టబిలిటీని ప్రజలందరూ వినియోగించుకోవాలని, అవగాహన పెంచుకోవాలని ప్రశ్నావన్ని రూపొందించారు.దానిపై విద్యార్థులతో ముఖాముఖిగా చర్చించారు.విద్యార్థులు ప్రత్యక్షంగా ప్రశ్నలు అడిగి ప్రశ్నావళి నిర్మాణంలో తలెత్తే అనేక అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్థశాస్త్ర విభాగం నుండి సుమారు 150 మంది విద్యార్థులు అవగాహన పొందారు. ఈ అవగాహన కార్యక్రమానికి డాక్టర్ సంపత్, డాక్టర్ నాగరాజు పాత, డాక్టర్ స్వప్న, డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్,లు పరిశోధనలో అనుభవాలను తెలిపారు