‘సాహితీ’ లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్న ఈడీ

– ప్రీలాంచ్‌ ఆఫర్లతో రూ.3 వేల కోట్ల స్కాం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో ప్రీలాంచ్‌ పేరిట భారీ మోసానికి పాల్పడిన సాహితీ సంస్థ యజమాని లక్ష్మీనారాయణను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రీలాంచ్‌ స్కీం పేరిట దాదాపు రూ.3 వేల కోట్ల మేరకు పెట్టుబడులను సేకరించి, తర్వాత మోసానికి పాల్పడినట్టు గతంలో హైదరాబాద్‌ నగర నేర పరిశోధక విభాగం (సీసీఎస్‌)లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసు ఆధారంగానే ఈడీ అధికారులు సైతం తమ వైపు నుంచి దర్యాప్తును ప్రారంభించారు. మనీలాండరింగ్‌కు లక్ష్మీనారాయణ పాల్పడ్డారనే కోణంలో దర్యాప్తును ముందుకు సాగించిన ఈడీ అధికారులు.. ఆయనను అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నట్టు సమాచారం.