– ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తమ పార్టీ నాయకులపై పక్షపాతపూరితంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఈడీని బీజేపీ రాజకీయ సాధనంగా వాడుకుంటోందని ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన మెమొరాండంలో కాంగ్రెస్ విమర్శించింది. రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొతాసరా నివాసంపై దాడులు చేశారని, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్‌కు నోటీసులు ఇచ్చారని అందులో వివరించింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌పై ఈడీ చేసిన ఆరోపణలను ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చింది. అభిషేక్ మను సింఘ్వి నేతృత్వంలో పార్టీ నేతలు తారిక్ అన్వర్, ఉజిత్ రాజ్‌తో కూడిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం బుధవారం ఎన్నికల కమిషన్‌ను కలిసింది. ఎన్నికల మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఈడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా కోరారు. దర్యాప్తు సంస్థలు నిస్పాక్షికంగా, తటస్థంగా, వివక్షకు తావులేకుండా పనిచేయాలని ఎన్నికల మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నాయని వారు తెలిపారు. ఎన్నికల కమిషన్‌ను కలిసిన అనంతరం సింఘ్వి విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ ‘ఎన్నికల విభాగం’ కార్యకలాపాలను వెంటనే అడ్డుకోవాలని కోరామని చెప్పారు. ఈడీ ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఎన్నికల ఏజెంట్‌గా పనిచేస్తోందని, తమ ముఖ్యమంత్రిపై ధృవీకరించుకోని ఆరోపణల తో ప్రకటనలు చేస్తోందని తారిక్ అన్వర్ ఆరోపించారు. న