– ఓటమి భయంతోనే బీజేపీ అడ్డదారులు : సీఎం
– రాజస్థాన్‌లో రాజకీయ ప్రకంపనలు
జైపూర్: విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘన (ఎఫ్‌ఇ ఎంఎ) కేసులో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్‌కు గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న న్యూఢిల్లీలోని ఇడి ప్రధానకార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే వైభవ్ గెహ్లాట్ మరింత సమయం కోరే అవకాశం ఉందని సమా చారం. కాగా, ఈ కేసులో ఆగస్టులో జైపూర్, ఉదరుపూర్, ముంబయి, ఢిల్లీల్లో ఇడి సోదాలు నిర్వహించింది. రాజ స్థాన్‌కు చెందిన ట్రిటన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ డైరెక్టర్లు, ప్రమోటర్లు శివ శంకర్ శర్మ, రత్తన్ కాంత్ శర్మ, ఇతరులకు వ్యతిరేకంగా ఈ సోదాలు జరి గాయి. ఈ సోదాల్లో లెక్క చూపని రూ 1.2 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. రత్తన్ కాంత్ శర్మకు వైభవ్ గెహ్లాట్‌కు మధ్య లావాదేవీలు ఉన్నాయని ఆరోపిస్తుంది. ఈ విషయంపైనే వైభవ్ గెహ్లాట్‌ను ఇడి ప్రశ్నించి, అతని స్టేట్‌మెంట్‌ను నమోదు చేస్తుందని భావిస్తున్నారు. గతంలో వైభవ్‌కు రత్తన్ కాంత్ ఒక కార్ రెంటల్ కంపెనీలో భాగస్వామిగా ఉన్నాడు.
పీసీసీ చీఫ్ నివాసంపై కూడా..
రాజస్థాన్ పీసీసీ అధ్యక్షులు గోవింద్ సింగ్ దోతస్రా, మహువా నియోజక వర్గ కాంగ్రెస్ అభ్యర్థి నివాసాలపై గురువారం ఈడీ దాడులు నిర్వహించింది. శికార్, జైపూర్ లో ఉన్న గోవింద్ సింగ్ నివాసాలపై పరీక్ష పేపర్ల లీక్‌కు సంబ ంధించిన ఒక మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఈడీ దాడులు నిర్వహించింది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మహువా నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఓం ప్రకాశ్ హుడ్లా, మరి కొందరు కాంగ్రెస్ నాయకులు నివాసాలపైనా ఈడీ దాడులు నిర్వహించింది.
కాంగ్రెస్ విమర్శలు
త్వరలో ఎన్నికలు జరిగే రాజస్థాన్‌లో కాంగ్రెస్ నాయకులపై ఈడీ దాడు లకు మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ విమర్శిం చింది. ఎన్నికలో పోరాటానికి దర్యాప్తు సంస్థల సహాయాన్ని మోడీ తీసుకుం టున్నారని ఆరోపించింది. ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన సమాధానం చెబు తారని తెలిపింది. తన కుమారుడికి ఈడీ సమన్లు జారీ చేయడంపై అశోక్ గెహ్లాట్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ కాంగ్రెస్ నాయకులను లక్ష్యంగా చేసుకుందని, దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్విని యోగం చేస్తోందని విమర్శించారు. గోవింగ్ సింగ్, ఓం ప్రకాశ్ నివాసాలపై ఫిర్యాదులు లేకుండానే ఈడీ దాడులు జరిగాయని ఆరోపించారు. ‘వైభవ్‌కు బుధవారం నోటీసులు జారీచేశారు. గురువారం కార్యాలయానికి హాజరు కావా లని సమన్లు జారీ చేశారు. ఇది జోక్‌గా ఉందా?’ అని గెహ్లాట్ ప్రశ్నించారు.