
మహేశ్వరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జిగా మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్ ముదిరాజ్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎడ్ల మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ చాలా రోజులుగా టీడీపీ పార్టీ అభివృద్ధి కోసం పనిచేశానని తెలిపారు. టీడీపీ కార్యకర్త నుంచి ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జిగా గుర్తుంచి బాధ్యతలు అప్పగించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పదవితో నాపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. బడుగు బలహీన వర్గాల వారికీ ఎన్నో అవకాశాలను అందించిన పార్టీ టీడీపీ అని అన్నారు. ఎన్టిఆర్ ఆశయాలు, చంద్రబాబు ఆచరణలో ప్రజలకు ఎన్నో సేవలు, ఎన్నో అభివృద్ధి పనులు, ఎన్నో సంక్షేమ పథకాల్ని అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. బడుగుబలహీన వర్గాల ముద్దుబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలో మళ్ళి తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజేష్ రెడ్డి, వాసు సాగర్ తదితరులు ఉన్నారు.