మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి: ఎడ్ల సుధాకర్ రెడ్డి

నవతెలంగాణ-అంబర్ పేట
మహిళల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని అంబర్ పేట బీఆర్ఎస్ ఇన్చార్జి ఎడ్ల సుధాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం అంబర్ పేట డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ లో లారా ఉమెన్స్ క్లౌడ్ కిచెన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎడ్ల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఫుడ్ ఇండస్ట్రీలో పాల్గొనడం చాలా హర్షనీయం వీరికి కావలసిన సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తామని క్వాలిటీ శుభ్రత పాటిస్తే తప్పక వ్యాపారం అభివృద్ధి పొందుతుంది అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పులి జగన్, విజిత రెడ్డి, జనార్దన్, జెడీ.రాహుల్, దిలీప్ కుమార్, బాబా గౌస్ పాషా, మహేష్ గంగా పుత్ర, పీసీఐ సంస్థ కు చెందిన ఏ.డీ.ఎబెనెజర్, వినోదకుమార్, శ్రీనివాసులు, జాకబ్ మరియు ఎల్ఏఆర్ఏ క్లౌడ్ కిచెన్ కు చెందిన లత రవి మరియు మెంబెర్స్ పాల్గొన్నారు.