– మేడారంలో జాతర విహంగ వీక్షణం
నవతెలంగాణ-మహదేవపూర్
ఆసియా ఖండంలోనే అతి ముఖ్యమైన ఆదివాసీ జాతర సామ్మక్క, సారలమ్మ జాతరకు తరలివచ్చే సందర్శకులకు నాడు ఎడ్లబండ్లు అందుబాటులో ఉండగా.. నేడు ఏకంగా హెలికాప్టర్లనే అందుబాటులో ఉంచారు. ఈ నెల 21 నుంచి 25 వరకు జరిగే మేడారం జాతరకు.. హన్మకొండ నుంచి అందుబాటులో ఉండే.. హెలికాప్టర్‌లో.. మేడారం జాతరకు ఒక రౌండ్ ట్రిప్‌తో సహా వీఐపీ దర్శనం పొందొచ్చు. అలాగే ప్రత్యేకంగా హెలికాప్టర్ జారు రైడ్ కూడా ఉంటుంది. జాతర పరిసరాలను విహంగ వీక్షణం చేయవచ్చు. ఒకేసారి ఆరుగురు ప్రయాణించే హెలికాప్టర్ ధరను ఒక్కొక్కరికి రూ.28,999గా నిర్ణయించారు. మరో రైడ్‌లో.. జాతర జరిగే ప్రాంతం మీదుగా 6 నుంచి 7 నిమిషాల పాటు గాలిలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టనుంది. అమ్మ వారి గద్దెల పక్క నుంచి మొదలయ్యే రైడ్.. జంప న్న వాగు, చిలుకలగుట్ట పక్కనుంచి చుట్టూరా ఉండే జాతర పరిసరాల మీదుగా సాగుతుంది. దీని కోసం ఒక్కొక్కరి నుంచి రూ.4800 వసూలు చేయనున్నారు. మహాదేవపూర్ మండలంలోని ప్రతి గ్రామం నుంచి మేడారానికి అధిక సంఖ్యలో సందర్శకులు తరలి వెళ్లారు. అలాగే మహాదేవపూర్ కాళేశ్వరం సిరివంచ నుంచి ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించారు.