ఎన్టీఆర్‌ వల్ల రాజకీయ రంగంలోకి వచ్చిన విద్యా వంతులు

– రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ కోలేటి దామోదర్‌
నవతెలంగాణ-కల్చరల్‌
నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీ పెట్టి ఎందరో విద్యావంతులను రాజకీయ రంగం లోకి తీసుకు వచ్చారని రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ కోలేటి దామోదర్‌ అన్నారు. అవినీతికి ఆస్కారం లేని రాజకీయాలు కావాలని ఎన్‌. టీ. ఆర్‌ ఆకాంక్ష అని అందుకే విద్యావంతులు మేధావులకు పార్టీ టికెట్‌ ఇచ్చి ప్రోత్సాహించారని ఆయన గుర్తు చేశారు. శ్రీ త్యాగరాయ గాన సభ లోని కళా సుబ్బారావు కళా వేదిక పై గాన సభ నిర్వహణ లో జరుగుతున్న ఎందరో మహానుభావులు కార్యక్రమాలలో భాగంగా విఖ్యాత నటుడు పూర్వ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి సమావేశం జఠిగింది. ముఖ్య అతిథిగా దామోదర్‌ పాల్గొని మాట్లాడుతూ నేడు రాజకీయ లో ఉన్న ఎందరో ప్రముఖులకు ఎన్‌ టీ ఆర్‌ ప్రేరణ అన్నారు. గాన సభ అధ్యక్షుడు కళా జనార్ధన మూర్తి అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఎన్‌. టీ ఆర్‌. సినీ రంగం లో కానీ రాజకీయ రంగం లో నైనా ఒక సంచలనం ఒక ప్రభంజనం అని అన్నారు. గాన సభకు ముఖ్య మంత్రి పదవిలో ఉన్నప్పుడు, లేని సమయం లోను సాంస్కృతిక సంస్థల కార్యక్రమాలకు అతిథిగా వచ్చారని గుర్తు చేసుకొన్నారు. వేదిక పైనాట్య గురువు డాక్టర్‌ భారతి, నైషధం సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు.