నిజామాబాద్ లో దుబ్బ ప్రాంతానికి సమీపంలో గల గీర్వాణి స్కూల్ షిఫ్టింగ్ చేయడం జరిగింది. దానికి కల్లుపాక ఎదురుగా గీర్వాణి స్కూల్కి విద్యాశాఖ అనుమతులు ఇచ్చిందని చెప్తూ గీర్వాణి యాజమాన్యం నూతన భవనంలోకి వెళ్లి స్కూల్ ని నడపడం జరుగుతుందని ఏఐపిఎస్ జ్వాలా శనివారం తెలిపారు. కానీ ఒక స్కూల్ పై పర్యవేక్షణ లేకుండా కనీసం ఒకసారి కూడా తనకి చేయకుండా ఏమాత్రం చుట్టుపక్కల బిల్డింగ్ ని చూడకుండా స్కూల్ కి పర్మిషన్ ఇవ్వడానికి విద్యాశాఖ ధైర్యం చేయడం శోచనీయం. కల్లు పాకకి ఎదురుగానే గీర్వాణి స్కూల్ కి పర్మిషన్ ఇచ్చిన మండల విద్యాశాఖ అధికారి రామారావు ఈ విషయంపై ఏఐఎస్ఎఫ్ గా ఆరా తీయగా స్కూల్ బిల్డింగ్ తాను ఇప్పటివరకు చూడలేదని స్కూల్ వాళ్ళని అడిగితే గీర్వాణి స్కూల్ యాజమాన్యం మా స్కూల్ చాలా బాగుంటుందని చెప్పారని వాళ్ళు చెప్పగానే ఆ స్కూల్ కి సంబంధించిన శిఫ్టింగ్ ఫైల్ పైన తన సంతకం చేసినట్టుగా మండల విద్యాశాఖ అధికారి చెప్పడం అమానుషం ఎవరికి వాళ్లే నోటి మాటకు విని సర్టిఫికెట్లపై సంతకాలు చెప్తే విద్యాశాఖ ఎందుకు ప్రభుత్వ అధికారులు ఎందుకు అని నిలదీయడం జరిగింది.
దాంతో సోమవారం వెళ్లి గీర్వాణి నూతన భవనాన్ని చూసి షిఫ్టింగ్ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఒకవైపు యువత ఇప్పటికే గంజాయి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇవి చాలా నట్టు కల్లుపాకలకు ఎదురుగా బాల్యదశలో ఉన్నటువంటి విద్యార్థులకు నర్సరీ నుంచి ఆరు ఏడో తరగతి వరకు దాని ఎదురుగానే విద్యాబోధన చేయడంతో కచ్చితంగా ఆ యొక్క వాతావరణ ప్రభావం పడుతుంది. దుర్భాషలు, గొడవలు విద్యార్థులపై ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాకుండా పసిపిల్లల పైన కూడా దాడులు జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కల్లుపాకకి ప్రాంగణంలో కొత్తగా పర్మిషన్ ఇవ్వడం ఆశ్చర్యపరుస్తుంది. మంచి మంచి వసతుల మధ్య ఉన్నపసి పిల్లలని కాపాడటమే విద్యాసంస్థలకు రోజు రోజు యుద్ధం లా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థినిలకు రక్షణ లేని ప్రాంతాలలో మత్తుకు అలవాటు పడే ప్రదేశాలను విద్యాసంస్థలు పెట్టడం కరెక్ట్ కాదని మరి ఎక్కడైనా ఆ స్కూలుకు షిఫ్టింగ్ పర్మిషన్ ఇవ్వాలని కల్లు పాకల దగ్గర విద్యాసంస్థలకు పర్మిషన్ ఇస్తే ఊరుకునేది లేదని జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాలా అన్నారు దీనిపైన జిల్లా కలెక్టర్ ని కలుస్తామని కూడా చెప్పారు. మండల ఎడ్యుకేషన్ అధికారిని కలిసిన వారిలో జ్వాలా, మేఘనా, రుచిత ఉన్నారు.