నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పాఠశాల విద్యాశాఖ సంచాలకులుగా పనిచేస్తున్న శ్రీదేవసేనకు కమిషనర్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీదేవసేనకు కమిషనర్‌గా పదోన్నతి రావడం పట్ల ఉపాధ్యాయ సంఘాల నేతలు, పలువురు అభినందనలు తెలిపారు.