అందరికి అందుబాటులో విద్య

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులోకి వచ్చిందని టీఎస్‌ఎమ్‌ఎస్‌ఐడీసీ చైర్మెన్‌ డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అన్నారు. సోమవారంనాడిక్కడి డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పాఠశాల విద్యపై నిర్వహించిన మూడు రోజుల పునశ్చరణ తరగతుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని పాఠశాలలను అభివద్ధి చేసుకున్నామనీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతం భారీగా పెరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల ను ప్రజలకు తెలియజేసేలా అధ్యాపకులు కృషి చేయాలని కోరారు.