విద్యా, వైద్యం మౌళిక సదుపాయాలకే ప్రథమ ప్రాధాన్యత: ఎమ్మెల్యే

First priority for education and medical infrastructure: MLAనవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం విద్యా వైద్యం మౌళిక సదుపాయాల కే అధిక ప్రాధాన్యత ఇస్తుందని,ఇందులో ప్రతీ పాఠశాలలో ను ఆ విధమైన ఏర్పాట్లు తో కూడిన సమీకృత పాఠశాలలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టి బోతున్నామని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని మహాత్మా జ్యోతిరావు పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్  ( గర్ల్స్ ) స్కూల్ లో విద్యార్థినిలు కు శుక్రవారం వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇచ్చారు.దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జారే విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ ఫౌండేషన్ డైరెక్టర్ దాసరి రంజిత్,దిండి సుధాకర్,ఉప్పపు రాము విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత చదువులపై అవగాహన వాటి యొక్క ప్రాముఖ్యత,ఉపాధి అవకాశాలు మానవతా విలువలు,ఉపాధ్యాయులు తల్లిదండ్రుల యొక్క గొప్పతనం,ఉత్తమ ఫలితాలు సాధించడానికి మెమరీ టెక్నిక్,క్రమశిక్షణ  వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.