విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి ఉచితంగా అందించాలి

Education, health care, employment, house, land should be provided free– ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు మల్యాల మనోహర్ 
– తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత 
నవతెలంగాణ – తాడ్వాయి 
పేద ప్రజలకు విద్యా వైద్యం ఉపాధి ఇల్లు భూమి అన్ని ఉచితంగా అందించాలని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు మల్యాల మనోహర్ అన్నారు. మంగళవారం ధర్మ సమాజ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు, రాష్ట్ర నాయకులు మల్యాల మనోహర్ స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఉచిత విద్య వైద్యం ఉపాధి ఇల్లు భూమి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజానీకానికి కనీస అవసరాలు అయినా కూడు, గుడ్డ, గూడు, వైద్యం, భూమి అందించాలని, ప్రభుత్వాన్నికి కనీస బాధ్యత అని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పేద ప్రజలకు నిత్యవసర సరుకులు పాటు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.