
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు విద్యాబోధన చేయడం జరుగుతుందని అచ్చంపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ ధమయంతి అన్నారు. గురువారం మండల పరిధిలోని హాజీపూర్ అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట- అంగన్ వాడి బాట కార్యక్రమంలో భాగంగా తల్లులతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా సీడీపీఓ మాట్లాడారు. కొత్త పాఠ్యప్రణాళిక ప్రకారం అంగన్వాడి సెంటర్లో ఇంగ్లీష్ బోధన బోధన జరుగుతుందన్నారు. 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు చిన్నారులను అంగన్వాడి కేంద్రాలకు పంపించాలని తల్లులకు సూచించారు. అంగన్వాడి స్కూల్ కి కొత్త సిలబస్ ప్రకారం మెటీరియల్ పంపిణీ చేస్తామని, తల్లులకు మెటీరియల్ డిజిటల్ స్క్రీన్ పై చూపించారు. అదేవిధంగా భేటీ బచావో బేటి పడావో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. జెండర్ ఈక్వాలిటీ, మహిళలపై చట్టాలు అవగాహన కల్పించారు. జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటమ్మ, రేణుక, సూపర్ వైజర్స్ రాజేంద్ర, సునీత తల్లులు కిశోర బాలికలు ఉన్నారు.