చదువు – సంస్కారం

            సుందరయ్య చిన్నప్పటినుంచే చదువుపట్ల ఎనలేని మక్కువ. చిన్న సుందరయ్య. చదువుకు ఆయన బావ బాగా సహకరించేవాడు.. తన పిల్లలకు సుందరయ్యలా చదువుకోవాలని లోకజ్ఞానం పెంచుకోవాలని చెప్పేవాడు. గ్రంథాలయాలకు వెళ్ళడం, వినోద యాత్రలు చేయడం, రాజకీయ కార్యకలాపాలు వేటికీ అడ్డం చెప్పేవాడు కాదు.. అయితే తమ్ముడు రామ్ మాత్రం -అల్లరి పనులు చేస్తూ ఏదో ఒక తంటా తెచ్చేవాడు. దాంతో తనను అప్పుడప్పుడూ శిక్షించాల్సి వచ్చేది. ఇది చివరకు బావ బావ మరుదుల మధ్య తగాదాగా మారింది. రాజమండ్రిలో రెండేళ్ళు వున్న తర్వాత 1926 లో సుందరయ్య, రామ్లు మద్రాసు వెళ్ళారు. అప్పటికే అక్కడ వున్న వీరారెడ్డి అనే బంధువు వాళ్ళు స్థిరపడ్డానికి సహాయం చేశాడు.
సుందరయ్య ట్రిప్లికేన్ లో హైస్కూలులో చేరి 6,7,8 హిందూ తరగతులు చదువుకున్నాడు. మద్రాసుకు వెళ్ళేప్పటికి ఆయనకు 13 సంవత్సరాలు మాత్రమే. అయినా పట్టువదలని చదువరిగా తెలుగులో ప్రసిద్ధమైన నవలలన్నీ చదివేశాడు. హిందూ హైస్కూలులో వుండగానే బుర్ర మరింత వికసించింది.. ఇంగ్లీషులో గాంధీజీ పుస్తకాలతో పాటు ఆయన నడిపే ఁయంగ్ ఇండియాఁ పత్రికను క్రమబద్దంగా చదవడం అలవాటు చేసుకున్నాడు. మునిసిపల్ లైబ్రరీకి వెళ్ళి హిందూ ఇతర ఇంగ్లీషు పత్రికలూ చదివేవాడు.. వివేకానంద ఉపన్యాసాలు 7 సంపుటాలూ, స్వామి రామతీర్థ రచనలూ దయానంద సరస్వతి రాసిన ‘‘సత్యార్థ ప్రకాశం’’ చదివేశాడు. ఇవన్నీ చదివాక పాశ్చాత్య దేశాలకు చెందిన కాంట్ రచనలు చదవడం మొదలు పెట్టాడు. సుందరయ్య పదవ తరగతిలో వుండగా స్కూల్లో భగవద్గీత గురించి వ్యాస రచన పోటీలో పాల్గొని ఒక వ్యాసం రాసిచ్చాడు. ఆ పోటీల న్యాయనిర్ణేతలలో ఒకరుగా వున్న తెలుగు లెక్చరర్ వాళ్ళ క్లాసుకు వచ్చి ఆయన రాసిన వ్యాసంలో పొరబాటు వుందని పెట్టాడు. మొదలు బిగ్గరగా చదవడం ‘‘క్రైస్తవులకు బైబిల్ ఎంతో మనకు భగవద్గీత అంత ముఖ్యమైనది’’ అన్న వాక్యంతో ఆ వ్యాసం మొదలైంది. భగవద్గీతను బైబిల్తో పోల్చడం ఆయనకు కోపం తెప్పించింది. గీత అంతకన్నా చాలా గొప్పదని ఆయన అభిప్రాయం. అయితే వ్యాసం సాంతం చదివాక ఆయనకు సందరయ్య రాసింది సరిగ్గానే వుందని అర్థమైంది. ‘‘నీవు గీతా రహస్యం మొత్తం ఎలా చదవగలిగావు అది చాలా పెద్దది.’’ సరిగ్గా ఆ పుస్తకంలో ఏముందో అదే వ్యాసంలో కూడా పొందుపర్చగలిగావుః అని అడిగారు. అంటే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు. ఫలితాన్ని గూర్చి పట్టించుకోవద్దు’ అన్నదే గీతలో సందేశం అని సుందరయ్య రాశాడు. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసలు కూడా మానవ సేవ గొప్పదని చెప్పడమే ఆయనకు బాగా నచ్చింది. అందుకే మైలాపూర్ లోని రామకృష్ణాశ్రమం తరచూ సందర్శించేవాడు. ఇదంతా 1927-28లో సంగతి. చిన్నవయస్సులోనే సుందరయ్య సాంఘిక సమస్యలపై ఆలోచించేవాడు. వూళ్లో వున్నప్పుడు దళితులను ఇంట్లోకి ఎందుకు రానివ్వవని వాళ్లు ‘‘అమ్మతో తగాదా వేసుకొనేవాడు. వ్యవసాయ కార్మికులకు న్యాయంగా రావలసింది ఇవ్వకుండా మోసం చేస్తున్నారని నిలదీసేవాడు. ఆనాటి తన అనుభవాలను సుందరయ్య ఇలా వివరించారు. నేను హరిజనులతో కలిసిపోవడం ప్రారంభించాను. వాళ్ళతో పాటు పొలంలో పనిచేసేవాణ్ణి. వారితో చాలా స్నేహంగా వుండేవాణ్ని. ఈ మాత్రం సానుభూతి చూపినందుకే వారు ఎంతో ఉత్సాహపడేవారు. వ్యవసాయ కార్మికులకు, ఇంట్లో పాలేర్లకు నా పట్ల చాలా అభిమానం వుండేది. తమను ఎలా పిలవాలనే దానిపై మా అమ్మతో అనేక సార్లు ఘర్షణపడటం వారు చూస్తుండేవారు. మా అమ్మ వాళ్ళను వారిపేర్ల చివర ‘‘గాడు’’, అని పిలవడం అవమానకరమైందిగా వుండేది. వాళ్లను వాళ్ల అసలైన పేర్లతో పిలవాలని చెప్పేవాణ్ని క్రమేణా నాకు హరిజనులతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. వారు తమ భావాలు, అలాగే తరాల పర్యంతం కొనసాగుతున్న సమస్యలు నాకు చెప్పుకునే వారు. వాళ్ళని భూస్వాములు ఎలా బాధలు పెడుతున్నదీ, చేలగట్లపై తమ పశువులను కూడా మేయకుండా వారెలా అడ్డుపడుతున్నది. అలాగే సరైన కూలి ఇవ్వకుండా చేస్తున్నది చెప్పేవాళ్ళు. యానాది అనే ఒక తెగ గ్రామంలో వుండేవాళ్ళు. వాళ్ళను నేరాలు చేసే తెగగా పరిగణించేవారు. వాళ్ళు ప్రధానంగా పంచార జీవులు, పశువులు తప్పిపోయినా లేక దోపిడీ జరిగినా ఇంకేదైనా కనిపించకపోయినా వాళ్ళనే అనేవాళ్ళు. వెంటనే పోలీసులు, ధనిక రైతులు వాళు ఎ ఎక్కడికి వెళ్తే అక్కడకు వెళ్ళి వెంటాడి వేధించేవారు. నానా ప్రశ్నలు వేసి చిత్ర హింస పెట్టేవాళ్లు ఒకరోజు వాళ్ల ఇంట్లో పనిచేసే యానాది ఒకరిని అన్నయ్య విచక్షణా రహితంగా కొడుతుంటే సుందరయ్య అడ్డుతగిలాడు. కుటుంబ సభ్యులకు పోలీసులకు వ్యతిరేకంగా నిలబడ్డాడు.