కాంగ్రెస్ ప్రభుత్వం లోనే విద్యకు అధిక ప్రాధాన్యత

– అరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం
– బీజేపీ నల్లచట్టలతో రైతుల మృత్యువాత
– రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి
నవతెలంగాణ – డిచ్ పల్లి
కాంగ్రెస్ ప్రభుత్వహయం లోనే విద్యకు అదిక ప్రాదాన్యత ఇచ్చామని, గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేసి 12% శాతం రిజర్వేషన్ అమలు చేస్తుందని, బీసీ కులఘననకు చట్టం బద్దత కల్పించి దేశంలోని ఎం రాష్ట్రం చేయని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నమని,గత బీఅర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలు ఎన్నో ఉన్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టలు తెరపైకి తేచ్చి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ఆందోళనకు దిగితే బాష్పవాయువు గోళలు,వాటర్ కేనన్ తో దాడు చేస్తుందని,ఒక రైతుకు పోట్టన పెట్టుకుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు . గురువారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలో ఐదు కోట్ల 63 లక్షల రూపాయలతో చేపట్టే నూతన పనులకు అయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ గత పది ఏళ్ళు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని అందులో భాగంగా నేడు 5 కోట్ల 63 లక్షల నిధులతో శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత బడ్జెట్లో విద్యా రంగానికి 45 వేల కోట్ల బడ్జెట్ను విద్యారంగానికి పెట్టి అన్ని సదుపాయాలు కల్పించే విధంగా కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. త్వరలోనే 6 గ్యారంటీలలో బాగంగా ఇప్పటికే రెండు గ్యారెంటీలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తుందని, వచ్చే వారం నుండి 500 వందలకు గ్యాస్,200యూనిట్ల వరకు కరెంట్ అందజేస్తామని ఇప్పటికే ప్రకటించారని ఆయన తెలిపారు.గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చేసిందని రాబోవు రోజుల్లో గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేసి వారి అభివృద్ధికి  కట్టుబడి ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లా అభివృద్ధి కొరకు ప్రభుత్వం అధిక నిధులు వెచ్చిస్తుందన్నారు.గత ఎన్నికల్లో చెప్పిన విధంగా 6 గారంటీలను నెరవేరుస్తామని త్వరలో ఎంపీ ఎన్నికలలో రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి భారీ ఎత్తున రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు 16 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే  భూపతి రెడ్డి  తెలిపారు. తిర్మన్ పల్లి లో నేలకోని ఉన్న సమస్యలను ఎంపిటిసి చింతల దాస్, గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు, మాజీ ఎంపిటిసి చింతల కిషన్ పలు సమస్యలు ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి దృష్టికి తీసుకొని వచ్చారు. అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ తీసుకొని నీదులు మంజూరు చేస్తానని, ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అప్ గ్రేడ్ చేసి ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తానని, తిర్మన్ పల్లి లో విద్యుత్ సబ్ స్టేషన్ కోసం ప్రతిపాదనలు అందజేసామని త్వరలోనే నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అదికారంలోకి వచ్చి ముడు నేలలు కాలేదని, బిఅర్ఎస్ నాయకులకు పదవులకు ప్రజలు దూరం చేశారని, హామీ ల అమలు కోసం మాట్లాడుతూన్నరని అదికారంలో ఉన్నప్పుడు అబివృద్ధి చేయలేదని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బిఅర్ఎస్ దే నన్నారు.గత ప్రభుత్వం పావల వడ్డీకి రుణాలు అందజేస్తామని చెప్పి,75 పైసలు వసుల్ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం సున్న వడ్డీకే రుణాలను అందజేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పేర్కొన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తే, బిఅర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను స్వాదీనం చేసుకుందని, ఇందిరమ్మ రాజ్యం లో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వివరించారు.అంతకు ముందు బాలికల పాఠశాల విద్యార్థినిలు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఘన స్వాగతం పలుకుతూ పాఠశాల తరఫున ప్రిన్సిపాల్, గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే భూపతిరెడ్డిని శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో  ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, దర్పల్లి మాజీ ఎంపీపీ, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి ముదిరాజ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోత్కురి నవీన్ గౌడ్, కిసాన్ ఖెత్ మండల అధ్యక్షులు సంతోష్ రెడ్డి, మాజీ ఎంపిటిసి చింతాల కిషన్, ఎంపిటిసిలు చింతల  దాస్, సుధాకర్, విడిసి అద్యక్షులు గోవర్ధన్, డెలిగేట్ సుధాకర్, కర్స మోహన్, డిసిసిబి డైరెక్టర్ కోరట్ పల్లి అనంద్, బైరయ్య, జంగిలి లక్ష్మి, మోహ్సిన్,సద్దం, ఆశిష్, ఎల్ ఐ సి గంగాధర్, మాజీ సర్పంచ్ రాములు నాయక్, తహసిల్దార్ వెంకటరావు, గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ లత,కాంగ్రెస్ పార్టీ నాయకులు,  కార్యకర్తలు, అధికారులు  పాల్గొన్నారు.