మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే ..

Education is the only thing that makes a man great.నవతెలంగాణ – మునుగోడు
మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే అని వెదిరే పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ మేఘ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ వెదిరే విజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కొంపెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  2023,2024 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రథమ బహుమతిగా 10 వేలు , ద్వితీయ బహుమతి 5 వేలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతమైన శిఖరాన్ని చేరుకునేందుకు పట్టుదలతో లక్ష్యాన్నిపెట్టుకొని చదివితే విజయ్ సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు క్రీడలపై పట్టు పెంచేందుకు 40 మంది విద్యార్థిని, విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు కోసం  30 వేల నగదును పాఠశాలకు అందజేశారు. పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు విషయం తెలవడంతో వెంటనే స్పందించి సొంత ఖర్చులతో ఉపాధ్యాయులను ఏర్పాటు కోసం కృషి చేశారు. పాఠశాలలో తమ తల్లి జ్ఞాపకార్థంగా స్టేజి నిర్మాణం చేపిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే  వేదిరే పూలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ సమస్యను పరిష్కరించి అండగా ఉంటామని తెలిపారు. గ్రామంలో వేదిరే ఫౌండేషన్ ఆధ్వర్యంలో  చేపట్టే సేవలకు గ్రామంలోని ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జాల వెంకన్న యాదవ్, పాఠశాల చైర్మన్ జీడిమడ్ల యాదయ్య , గ్రామ సభ్యులు వడ్లమూడి హనుమయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు , ఉపాధ్యాయుల బృందం తదితరులున్నారు.