విద్యాశాఖ మంత్రి గెలుపునకు కృషి చేయాలి

– మార్కెటింగ్‌ చైర్మన్‌ సురసాని సురేందర్‌రెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని మార్కెటింగ్‌ చైర్మెన్‌ సురసాని సురేందర్‌ రెడ్డి అన్నారు. కందుకూరు మండలంలోని అన్నోజిగూడ గ్రామంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం గ్రామ సర్పంచ్‌ కాకి ఇందిరమ్మ దశరథ, గ్రామ శాఖ అధ్య క్షులు ఢిల్లీ జంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యకమానికి ముఖ్యఅతిధిగా చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో సబితమ్మను గెలిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మల్లి రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటుకు కార్యకర్తలు కంకణబద్దులై పనిచేయాలని కోరారు. ప్రతి ఓటర్‌ను కలిసి మన ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను వివరించాలని తెలిపారు. అన్నోజీగూడ గ్రామంలో బీఆర్‌ఎస్‌కు అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు చెందిన 30మంది బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కాకి రాములు, నాయకులు గొర్రెంకల యాదయ్య, యూత్‌ మండల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గొర్రెంకల రామకృష్ణ, యూత్‌ గ్రామశాఖ అధ్యక్షులు ఢిల్లీ రమేష్‌, ఎడ్ల కృష్ణ, జక్కుల మహేందర్‌, గోదాస్‌ గణేష్‌, పుచ్చల మహేందర్‌, అందుగుల అంజి, ఢిల్లీ నారాయణ, సురేష్‌ నాయక్‌, రఘురాం నాయక్‌, లక్ష్మణ్‌నాయక్‌ అందుగుల రాజు, మహిపాల్‌గౌడ్‌, విక్రమ్‌ గౌడ్‌, ఢిల్లీ సురేష్‌, ఢిల్లీ రవీందర్‌, ఢిల్లీ దేవేందర్‌, కాకిగిరి ప్రదక్షిణ పాల్గొన్నారు.