నవతెలంగాణ-కందుకూరు
నేడు కందుకూరు మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు ఉదయం 9 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తీగల అనితరెడ్డి హాజరవుతున్నట్టు జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారున. కందుకూరు మండలంలోని సరస్వతిగూడ, అగర్మియగూడ, లేమూరు, తిమ్మాపూర్, జబ్బార్గూడ, మాదాపూర్, కొలన్ గూడ, గుమ్మడవెల్లి, రాచులూరు, భైరగూడ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. రూ.10 కోట్ల16లక్షల నిధులతో నిర్మించిన సీసీరోడ్లు, అండర్ డ్రయినేజీ నిర్మాణ పనులు, నూతన గ్రామపంచాయతీ భవనాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి సర్పంచులు ఎంపీటీసీలు, ముఖ్య కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో హాజరై, విజయవంతం చేయాలని కోరారు.