విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

– టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చుంచు శ్రీశైలం
నవతెలంగాణ నెల్లికుదురు: ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు చుంచు శ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం తొర్రూరు లో జరుగుతున్న జోనల్ స్థాయి విద్యాసదసుకు నెల్లికుదురు మండలం టి పి టి ఎఫ్ సభ్యులు తరలి వెళ్తున్న సందర్భంగా నెల్లికుదురు ఎంఆర్సి కార్యాలయం ముందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు చుంచు శ్రీశైలం మాట్లాడుతూ కులాల ప్రతిపాదికన గురుకులాలు గతంలో ఏర్పాటు కావడం జరిగింది అని అన్నారు, కానీ ప్రస్తుతము మూతపడిన ప్రతి పాఠశాలను తెరవాలని ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు, ఉపాధ్యాయుల సమస్యలైన సిపిఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల బకాయిలను చెల్లింపు,ఉపాధ్యాయుల ప్రమోషన్, బదిలీల ప్రక్రియపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. మన ఊరు మనబడి అనే కార్యక్రమంతో మండలంలో ఒకటి రెండు పాఠశాలలో సెలెక్ట్ చేసి టాయిలెట్స్ నల్లాలు ఏర్పాటు చేసి రంగురంగులతో కళ్ళల్లో వేశారా తప్ప వాటితో విద్యార్థులకు ఉపయోగం లేదని అన్నారు అలా కాకుండా విద్య బలోపేతానికి కృషి చేయాలని అన్నారు ప్రతి పాఠశాలకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి సంగ శ్రీనివాస్ మండల కమిటీ సభ్యులు ఉదయ్ కిరణ్, నవీన్, రవి, తదితరులు పాల్గొన్నారు.