
– రాష్ట్ర రవాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రూ.11 వేల కోట్ల రూపాయలతో 25 వేల ప్రభుత్వ పాఠశాలలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక వసతులను కల్పిస్తున్నామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు .గురువారం హుస్నాబా్ పట్టణంలోని శుభం గార్డెన్స్ లో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి విద్యాశాఖ అధికారుల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సంవత్సరాల తరబడి తీరని సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిష్కరించామన్నారు. ఉపాధ్యాయులు చైతన్యావంతమైన సమాజ నిర్మాతలు అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ోట్లతో 30 నియోజకవర్గాలలో 25 ఎకరాల్లో సమీకృత గురుకుల విద్యాలయాలను ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనుందన్నారు. డీఈవో లు, ఎంఈఓ లు, హెచ్ ఎం లు, హాస్టల్ వార్డెన్లు విద్యాలయాల్లో అవుసరమైన మౌలికవసతులు, విద్యావసతుల కల్పన కొరకు నివేదికలు పంపాలన్నారూ. కాలేజీలు, స్కూళ్లు, హాస్టళ్ళ వారిగా సమస్యల వివరాలను ప్రభుత్వం చూసించిన 55 అంశాల ఫార్మాట్ లో సేకరించిన సమస్యలపై రెండు మూడు రోజుల్లో ఉపముఖ్యమంత్ి నేత్రుత్వంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.కాలేజీలు, స్కూళ్లు, హాస్టళ్ళ వారిగా సమస్యల వివరాలను ప్రభుత్వం చూసించిన 55 అంశాల ఫార్మాట్ లో సేకరించిన సమస్యలపై రెండు మూడు రోజుల్లో ఉపముఖ్యమంత్రి నేత్రుత్వంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి, ఏఎస్పీ సతీష్, మున్సిపల్ ఛైర్ పర్సన్ ఆకుల రజిత, తహసీల్దార్ రవీందర్, సిద్దిపేట డిఇఓ శ్రీనివాస్ రెడడి,కరీంనగర్ డిఇఓ జనార్దన్ రావు, హన్మకొండ డిఇఓ వాసంతి తదితరులు పాల్గొన్నారు.