గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చిన్నారులకు ఆటపాటలతో విద్యను అందించాలని ఐసిడిఎస్ సూపర్ వైజర్ వాణి తెలిపారు. మంగళవారం నసూరుల్లాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా నేడు ర్యాలీ నిర్వహించారు. అలాగే బీర్కూర్ మండల లోని వివిధ గ్రామాల్లో అమ్మ మాట అంగన్ వాడి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి మాట్లాడుతూ.. చిన్నపిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య ఎంతో కీలకమని, పాఠశాలల్లో చేరేనాటికి అక్షరాలు, అంకెలు నేర్పి ఆటపాట లతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నూతనంగా అమ్మ మాట.. అంగన్‌వాడీ బాట కార్యక్ర మానికి శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలిపారు. బాన్సువాడ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో అమ్మ మాట.. అంగన్‌వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అంగన్‌వాడీలను బలోపే తం చేసేందుకు కేంద్రాలకు రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను చేర్పించేందుకు సోమవారం నుంచి ఈనెల20వరకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్ర మాన్ని ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారానే అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారులకు ఉచితంగా యూనిఫాం కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి అంగన్‌వాడీ సెంటర్‌లో చిన్నారుల నమోదు శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఐకెపి ఏటీఎం గంగాధర్ ఆరోగ్య సిబ్బంది వెంకటలక్ష్మి అంగన్‌వాడీ టీచర్లు గౌరీ గంగమణి ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.