విద్యార్థులకు పౌష్టికాహారం, విలువలతో కూడిన విద్యను అందించాలి

– సోషల్ జస్టిస్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా ఇన్చార్జి ప్రసాద్
నవతెలంగాణ-జక్రాన్ పల్లి
విద్యార్థులకు పౌష్టికాహారం మరియు విలువలతో కూడిన విద్యను అందించాలని సోషల్ జస్టిస్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా ఇన్చార్జి ప్రసాద్ మంగళవారం అన్నారు. జక్రాన్ పల్లి మండలం   పడకల్ గ్రామంలోని ప్రైమరీ పాఠశాలలో స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొంత మంది విద్యార్థులకు సోషల్ జస్టిస్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల విజయ్ కుమార్  ఆదేశాలనుసారంగా అందరికీ విద్య అది బాలల హక్కు అని తెలియజేస్తూ వారికి పౌష్టికాహారం మరియు విలువలతో కూడిన విద్యని అందించాలని చెబుతూ మరియు ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువులో ముందున్న విద్యార్థులను  చిన్న బహుమతులు అందించి అభినందించారు . కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ ప్రసాద్  మరియు నిజామాబాద్ రూలర్ వర్కింగ్ కమిటీ చైర్మన్ బట్టి దత్తాద్రిగౌడ్   ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.