ప్రభుత్వ రంగంలో మాత్రమే విద్యను అందించాలి

– ప్రయివేటు రంగంలో వద్దు
– ప్రో.కంచె ఐలయ్య
– మహనీయుల స్పూర్తి అవసరం
– సీఈఓ డా.వెంకట్‌ మారోజు
నవతెలంగాణ-ఓయూ
ప్రభుత్వ రంగంలో మాత్రమే విద్యను అందిం చాలని, ప్రయివేటు రంగంలో వద్దనిప్రో.కంచె ఐల య్య అన్నారు. ఓయూ ఫూలే అంబేద్కర్‌ సమగ్ర పరిశోధన, సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిం చిన మహనీయుల జయంతి ఉత్సవాలను శనివా రం ఓయూ ఆర్ట్స్‌ కళాశాల లో రూమ్‌ నెంబర్‌ 133 లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, అధ్యా పకులు, పరిశోధక విద్యార్థులు హాజయ్యారు. ముఖ్య అతిథులుగా ఓయూ పూర్వ విద్యార్థి, అమెరికాలోని సోర్స్‌ ట్రేస్‌ సీఈఓ వెంకట్‌ మారోజు, విశ్రాంత అధ్యా పకులు, సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ కంచ ఐలయ్యలు పాల్గొన్నారు. ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య మాట్లాడుతూ ప్రతీ విద్యార్థికి ఆంగ్లమాధ్యమంలో ఉచిత విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. ప్రయివేటు విద్యావిధానానికి స్వస్తి పలికి ప్రభుత్వరంగంలో మాత్రమే విద్యను అందిం చాలని సూచించారు. సమానత్వం, సామాజిక న్యాయం దిశగా ఇంటినుంచే మార్పు కోసం అడుగు పడాలని వివరించారు. సమాజంలో సామాజిక అసమానతలకు కులమే కారణమన్నారు. కుల రహిత సమాజం దిశగా కార్యాచరణ ఉండాలని తెలిపారు. వెంకట్‌ మారోజు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా ఫూలే, డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌ రామ్‌ లాంటి మహనీయుల స్పూర్తి ప్రతి ఒక్కరికీ ఆచరణీయమన్నారు. రాజకీయ ప్రజా స్వామ్యం నుంచి సామాజిక ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. విజ్ఞానం ద్వారానే రాజకీయ, సామాజిక అసమా నతలు లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోగలమని స్పష్టం చేశారు. నేటికీ లక్షలాది మంది పేదరికం, వివక్షతను ఎదుర్కొంటున్నారన్న, విజ్ఞాన విప్లవం ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వివరించారు. ఓయూ వీసీ ప్రో. దండెబోయిన రవిందర్‌ యాదవ్‌ మాట్లాడుతూ కలిసికట్టుగా మహనీ యులను స్మరించుకోవటం, వారి ఆశయాలను ఆచరణలో పెట్టేందుకే ఫూలే-అంబేద్కర్‌ సమగ్ర పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్‌ ల లను ఒకే వేదికపైకి తెచ్చి సమగ్ర అధ్యయన కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చి సామాజిక సమస్యలపై పరిశోధనలు జరుపుతున్నట్టు వెల్లడించారు. గత మూడేండ్లలో ఓయూలో తీసుకొచ్చిన సంస్కరణలను చెప్పారు. ఫూలే, అంబే ద్కర్‌ సహా ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య రచనల ప్రభా వం తనపై ఉందని గుర్తు చేశారు. అందుకే ఓయూ లో 50శాతం పరిపాలనా పగ్గాలను మహిళలకు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఓయూ రాజనీతి శాస్త్ర విభాగం నుంచి ఐఏఎస్‌ సాధించిన నరేంద్ర పడాల్‌ను అతిథులు సత్కరించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రీసెర్చ్‌ సెంటర్‌, ఎస్సీ, ఎస్టీ సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ మంగు, మహాత్మా జ్యోతిబా ఫూలే పరిశోధనా కేంద్రం, బీసీ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ చలమల్ల వెంకటేశ్వర్లు, మహల ఖాభాయి చందా మహిళా పరిశోధనా కేంద్రం, మైనార్టీ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సయ్యదా అజీమ్‌ ఉన్నీసా ల నేతత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. రిజిస్ట్రార్‌ ఆచార్య పి. లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ఆచార్య బి. రెడ్యానాయక్‌, యూజీసీ వ్యవహారాల డీన్‌ ఆచార్య జి. మల్లేశం, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య అర్జున్‌ రావు కుతాడి అతిథులుగా పాల్గొన్నారు.