నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాన్ని బలోపేతానికి తగిన నిధులు కేటాయించాలని బహుజన లెఫ్ట్ పార్టీ (బహుజన కమ్యూనిస్టు) (బిఎల్ పి)రాష్ట్ర అధ్యక్షులు,బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బిఎల్ఎఫ్ 7వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బహుజన లెఫ్ట్ పార్టీ (బహుజన కమ్యూనిస్టు) బిఎల్ పి జిల్లా కార్యాలయం వద్ద జరిగిన బిఎల్ఎఫ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ విద్య, వైద్య రంగ అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లను, సిబ్బంది నియమించాలని డిమాండ్ చేశారు.సంక్షేమ పథకాలతో పాటు విద్య వైద్య రంగాన్ని బలోపేతానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ రాష్ట్ర కమిటి నాయకులు మేత్రి రాజశేఖర్, జిల్లా కన్వీనర్ కె. శ్రీనివాస్, జిల్లా నాయకులు జె.సత్యనాలయణ, నగర కమిటి నాయకులు అనిల్ ,స్వాతి, కపీల్, జీజాబాయి, రాధా బాయిలతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.