పాలక భారతీయ జనతాపార్టీ తన రెండు విడతల అధికారాన్ని పూర్తి చేసే సమయం దగ్గర పడుతుండటంతో, విద్యా సంస్థలపై దాని ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్ఫో ర్స్‌మెంట్ డైరెక్టొరేట్, ఆదాయ పన్నుల శాఖ అధికా రులు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లు, ప్రతి పక్ష పార్టీలను చిక్కు పరిస్థితుల్లోకి నెట్టివేయడంలో తమవంతు పాత్రను పోషించాయి. కొన్ని సంద ర్భాల్లో ఎలక్షన్ కమిషన్ పక్షపాత ధోరణిని ప్రద ర్శించింది. అధికార భారతీయ జనతాపార్టీ రాజకీయ భావజాలానికి అనుగుణంగా విద్యావిధానం, నిర్మా ణాన్ని మార్పు చేయాలని జరుగుతున్న ప్రయత్నంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)లు ఏ మాత్రం వెనుకబడి పోలేదని ఇప్పుడు స్పష్టం అవుతుంది.
విద్యార్ధుల్లో హిందూ జాతీయవాద భావోద్వేగాలను, నైతిక ధోరణులను పరిచయం చేసే ఉద్దేశంతో విద్యా సంస్థలకు క్రమం తప్పకుండా కొత్త సూచనలను పంపిస్తున్నారు. ప్రస్తుత పాలక ప్రభుత్వం విద్యార్ధి ఉద్యమాలను బలహీనపరచి, బెదిరింపులకు గురి చేసే ప్రయత్నం చేసినపుడు, విద్యార్థులు నిరసిస్తే, ఆ నిరస నలు జాతి వ్యతిరేకం అని ముద్ర వేసింది. ప్రతీ విశ్వవిద్యా లయంలో జాతీయ జెండాను ఆవిష్కరించడానికి ఒక పొడవైన స్తంభాన్ని ఏర్పాటు చేయాలని మానవ వనరుల అభివద్ధి మంత్రిత్వ శాఖ మాజీ మంత్రి స్మతీ ఇరానీ ప్రతిపాదన చేసింది. సహజంగానే ప్రభుత్వ ఆలోచనలకు వ్యతిరేకంగా విద్యార్థులు బహిరంగంగా చర్చలు జరిపే జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయ ప్రాంగణంలో ఆయుధ వినియోగ విధానాన్ని అధికారికంగా నిలిపివేసే మిలిటరీ ట్యాంక్ ను ఉంచాలనే మరొక ఆలోచన తెరపైకి వచ్చింది.
ఇటీవల కాలంలో మరిన్ని సర్క్యులర్లను జారీ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) స్థాపకుడైన ఒక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు ప్రచారకుడు, దత్తాజీ దిదోల్కర్ శతజ యంతి (సంవత్సర కాలంపాటు జరిగే)ఉత్సవాల్లో విద్యార్థులం దరూ తప్పనిసరిగా పాల్గొనాలని ఒకరు చెపుతారు. ఒక హిందూ జాతీయవాది కోసం కోరుతున్న ఈ జీవ న విధానపు ఆచరణ ప్రధానంగా మహారాష్ట్రలో కళా శాలల కోసం ఉద్దేశించబడింది. హిందూ జాతీయ వాదానికి చెందిన వ్యక్తి ఉత్సవాలను యూజీసీ ప్రో త్సాహించడం నరియైనదేనా? వాస్తవానికి యూజీసీ, బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిని లేదా భారత జాతీయవాదం కోసం నిలబడిన వారిని ప్రోత్సహించాలి. కానీ దిదోల్కర్‌కు, స్వాతంత్య్ర పోరాటంలో ఎలాంటి భాగస్వామ్యం లేదు. అదేవి ధంగా స్వాతంత్య్ర భారతదేశ రాజ్యాంగంలో పొందు పరచిన విలువలను అతడు ఏ విధంగానూ ప్రతి బించలేదు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని మరొక సర్క్యు లర్ డిమాండ్ చేస్తుంది. 2024 లోక్‌సభ ఎన్నిక లను దష్టిలో ఉంచు కొని అలాంటి చర్యల్ని చేపడుతు న్నారు, కానీ ఒక ప్రజాస్వామ్య దేశం లో అలాంటి వాటికి స్థా నం ఉండదు. అది ప్రజా స్వామ్య నైతికతను, ప్రజా స్వామిక, రాజ్యాంగ విలు వలను ఘోరంగా ఉల్లంఘిం చడమే అవుతుంది. ఇది అధికా రాన్ని మొత్తంగా దుర్వినియోగం చేయడమే.
అంతేకాదు, చరిత్ర పా ఠ్యాంశాలలో భాగంగా ఏడవ తరగతి నుండి పన్నెండవ తరగతి చదువుతున్న విద్యార్థులకు రామా యణం, మహాభారతాలను బోధించా లని, వాటిని ‘సాంప్రదాయ కాలం’ (క్లాసికల్ పీరియడ్)లో ఉంచాలని ఇటీవలకాలంలో ఒక ఆదేశం జారీ అయింది. ఎన్సీఈఆర్టీ నిపుణుల బందం చెప్పేదాని ప్రకారం రామాయణం, మహాభారతాలను నేర్చు కోవ డం వలన ఆత్మగౌరవం, దేశభక్తి, ఆత్మసంతప్తి పెరుగుతుంది.
భారతదేశ రెండు గొప్ప ఇతిహాసాలు మన పురాణాలలో ఒక భాగంగా ఉన్నాయి. అవి వ్రాయబడిన కాలం నాటి సమాజం, నియమనిబంధనల గురించి అద్భుతమైన విజ్ఞానాన్ని అందించ గలవు. ఈ గొప్ప ఇతిహాసాలు అస్పష్టమైన అవగాహన లేదా అసంపూర్ణమైన జ్ఞానంలో చిక్కుకొని పోయిన చరిత్ర కాలాల గురించి నిశితదష్టిని కలుగజేస్తాయి.
భారతదేశానికి అవతల అంటే శ్రీలంక, థారులాండ్, బాలి, సుమత్రా, ఇంకా ఇతర ప్రాంతాల్లో రామాయణం ప్రసిద్ధి చెందిం ది. ఆసక్తికరమైన విషయం ఏమంటే, రామాయణానికి అనేక వత్తాంతాలు (వెర్షన్స్) ఉన్నాయి. వాస్తవానికి వాల్మీకి చేత వ్రాయ బడిన రామాయణం, గోస్వామి తులసీదాస్ వ్రాసిన అవధి ఇతి హాస రామాయణం ద్వారా జన సమ్మతం అయ్యింది. 16వ శతా బ్దం నుండి ఉత్తర భారతదేశంలోని ప్రసిద్ధ సంస్కతిలో ఇది భాగంగా మారింది. అనేక రామాయణ వత్తాంతాలు, దాని వైవిధ్యమూలాలు, భౌగోళికవ్యాప్తి నుండి వచ్చాయి. కానీ హిందూ జాతీయవాదులు మాత్రం కేవలం ఒక వత్తాంతాన్నే గొప్ప ఇతి హాసంగా ప్రోత్సహిస్తున్నారు. పౌలా రిచ్ మాన్ రచించిన ‘మెనీ రామాయణ్స్:ద డైవర్సిటీ ఆఫ్ ఏ న్యారేటివ్ ఇన్ సౌత్ ఏషియా’ ను1991లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ మొదటిసారి ప్రచురిం చింది. ఇది శ్రీరాముని కథ వైవిధ్యమైన వత్తాంతాలను పరిశోధి స్తుంది. ప్రముఖ మేధావి ఏ.కే. రామా నుజన్ రచించిన అసాధారణ వ్యాసం, ‘300 రామాయ ణాస్: ఫైవ్ ఎగ్జాంపుల్స్ అండ్ త్రీ థాట్స్ ఆన్ ట్రాన్స్లేషన్’ ను 2011 వరకు ఢిల్లీ విశ్వ విద్యా లయంలో బోధనాంశాలలో చే ర్చారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడంతో ఆ విశ్వవిద్యాలయం ఒత్తిడికి గురైంది.
రామానుజన్ మనకు వైవిధ్యమైన కథనాలు అంటే జైన, బౌద్ధ, మహిళల (చివరగా రంగ నాయకమ్మ) రామాయ ణాల గురించి చెప్తే, హిందూ జాతీయ వాదులు శ్రీరాముని కథల్లోని ఒకే ఒక నిర్దిష్టమైన వత్తాంతాన్ని ప్రామాణికంగా ముందుకు తీసు కురావాలని అనుకుంటున్నారు. ‘ఆదివాసీ రామాయణం’ కూడా మిగిలిన వాటికి భిన్నమైన ఇతివత్తాన్ని కలిగి ఉంది. కానీ ప్రధాన స్రవంతి మీడియా, ప్రభుత్వం దానిని దాచిపెట్టాలని అనుకుంటున్నాయి.
బీ.ఆర్.అంబేద్కర్, తన ”రిడిల్స్ ఇన్ హిందూ యిజం” రచనలో రాముడు, తపస్సు చేస్తున్న సమయంలో శంబూకుని (శూద్రులకు సమానత్వాన్ని నిరాకరించడంతో) చంపిన విష యంలో మన దష్టిని ఆకర్షించాడు. కొన్ని అణగారిన వర్గాలలో గౌరవనీయమైన పాలకుడైన బాలిని కూడా రాముడు చంపాడు. ‘మన బాధలు పోనివ్వండి, బాలి రాజుగా తిరిగి రాని వ్వండి’ అనేది ప్రార్థన. ద్రోహం చేసిందనే అనుమానంతో రాము డు, సీతను బహిష్కరించి, అడవులకు పంపడాన్ని అంబేద్కర్ విమర్శి స్తాడు. ద్రావిడులపైన ఉత్తర భారత ఆర్యవాదాన్ని విధించిన విషయంలో పెరియార్ కూడా శ్రీరాముడిని విమర్శిస్తాడు.
అదేవిధంగా మహర్షి వేద వ్యాసుడు రచించిన మహా భార తం, ఇప్పటి వరకు రచించబడిన అతి పొడవైన పద్యం. ఇది మన గతానికి సంబంధించిన విలువైన అనుభవాలను అంది స్తుంది. చారిత్రక విజ్ఞానానికి మన ఇతిహాసాలన్నీ అవసరమైన వనరులే, కానీ చరిత్ర పాఠ్య ప్రణాళికలోకి వాటిని దిగుమతి చేయడం వలన చరిత్రకు గానీ, ఇతిహాసాలకు గానీ, పురాణాల పట్ల మనకున్న అవగాహనకు గానీ ఎలాంటి న్యాయం జరగదు. ఇది, మన గతానికి సంబంధించిన వాస్తవాలను అవగాహన చేసుకునే దానికంటే కూడా హిందూ జాతీయవాద ఎజెండాతోనే ఎక్కువగా ముడిపడి ఉంది.
భారతదేశానికి బ్రిటీష్ మూలాలు ఉన్నాయి కాబట్టి ఇండి యా, బానిసత్వాన్ని నిర్దేశిస్తుందన్న కారణంగా ఇండియా స్థానం లోకి భారత్‌ను తీసుకొని రావాల్సిన అవసరం ఉందని ఎన్సీఈఆర్టీ నిపుణుల ప్యానెల్ సూచించింది. బ్రిటీష్ వారు రావడానికి చాలా కాలం ముందే ఇండియా అనే పదం వైవిధ్యాల ఉనికిని ఉద్దేశపూర్వకంగానే అణచివేస్తున్నారు. బీసీఈ 303 నాటికి, గ్రీకు యాత్రికుడు, దౌత్యవేత్త అయిన మెగస్తనీస్ ఇండికా అనే పదాన్ని ఉపయోగించాడు. భారతదేశాన్ని సూచిస్తూ సింధూ నది నుండి వచ్చిన పదాల మూలాలు ప్రారంభం నుండి వాడుకలో ఉన్నాయి. అందుకే మన రాజ్యాంగంలోని ”భారత్” అనే ”ఇండియా” అనేది మనకు సరైన సూత్రీకరణ. కానీ, ఇండియా/భారత్ ప్రాతినిధ్యం వహిస్తున్న వైవిధ్యం, కలుపుకొని పోయే విధానం, నిష్కపటత్వా లతో హిందూ జాతీయవాదం అసౌకర్యంగా ఉంటుంది. వారు భారతదేశ చరిత్రను పునర్నిర్మాణం చేయాలని అనుకుంటున్నారు. భారతీయ చరిత్ర ప్రారంభకాలాన్ని బ్రిటీష్ వారు ‘హిందూకాలం’ అని పిలవగా, ఇప్పుడు హిందూ జాతీయవాదులు దానిని ‘సాంప్ర దాయకాలం’గా (క్లాసికల్ పీరియడ్) పిలవాలని కోరుకుం టున్నారు. ఆ కాలపు విలువలు నేటి సామాజానికి గీటురాయిగా అందించాలనేదే వారి ఆలోచన. వాటిలో చాలా విలువల్ని మను స్మతిలో చూడవచ్చు, ప్రచారం చేయబడిన విలువలే, అంబేద్కర్ ఈ మనుస్మతికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేట్టు చేశాయి.
(”న్యూస్ క్లిక్” సౌజన్యంతో)
అనువాదం : బోడపట్ల రవీందర్, 9848412451
రామ్ పునియానీ