అంగన్‌వాడీలో ఆటపాటలతో కూడిన విద్య

అంగన్‌వాడీలో ఆటపాటలతో కూడిన విద్యనవతెలంగాణ-తాండూర్‌
అంగన్‌వాడీల్లో పౌష్టికాహారంతో పాటు ఆటపాటలతో కూడిన విద్యను అందించడం జరుగుతుందని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ మమత అన్నారు. శనివారం మండలంలోని మాదారం గ్రామపంచాయతీలో 35 మంది టీచర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులకు నిర్బంధ విద్యలా కాకుండా, ఆటాపాటలతో పాఠ్యాంశాలను బోధించాలని చెప్పారు. పిల్లలు పూర్వ ప్రాథమిక విద్య అంగన్‌వాడీ కేంద్రాలలో పూర్తి చేసుకునే విధంగా టీచర్లు బోధించాలని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.