రేపు విద్యా సంస్థలు బంద్ విజయవంతం చేయాలి..

నవతెలంగాణ – మునుగోడు
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 4వ తేదీన దేశవ్యాప్తంగా చేపట్టనున్న విద్యాసంస్థల బందును విజయవంతం చేయాలని డివైఎఫ్ఐ జిల్లా నాయకులు కట్ట లింగస్వామి, ఏఐఎస్ఎఫ్ , ఏఐవైఎఫ్  మునుగోడు మండల కార్యదర్శులు చాపల విప్లవ కుమార్, బండారి శంకర్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు . దేశంలో మోదీ  విద్యారంగాన్ని బ్రష్టు పట్టించారని పేపర్ లీకులు , పరీక్ష రద్దు ద్వారా  దేశ ప్రతిష్టను దిగదర్చారని అన్నారు. రాష్ట్రం లో ప్రైవేటు కార్పొరేట్ ఫీజుల దందాను నియంత్రించాలన్నారు డిమాండ్ చేశారు  ఈ సమావేశంలో గోపాగోని ఉదయ్ కుమార్, వంశి, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.