గాంధారి మండలంలో విద్య సంస్థలు బంద్ సంపూర్ణం

నవతెలంగాణ- గాంధారి
వివిధ విద్యార్థి సంఘాల బంద్ పిలుపు మేరకు గాంధారి మండలంలోని అన్నీ పాఠశాలలను, కళాశాలలను మూత బడ్డాయి నీట్ ప్రశ్నా పత్రం లీకేజిపై నిరసన వ్యక్తం చేస్తూ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎన్ ఎస్ యూ ఐ తరుపున బంద్ కాల్ ప్రకటించి విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యూ ఐ నియోజకవర్గ అధ్యక్షులు సర్దార్ నాయక్, మండల అధ్యక్షులు రహమత్, ఉపాధ్యక్షులు గుర్రం మోహన్, పి డి ఎస్ యూ  జిల్లా ఉపాధ్యక్షులు మోజీరం, మండల యూత్ ఉపాధ్యక్షులు జువ్వాడి వినయ్ కుమార్, రంజిత్ మరియు విధ్యార్తులు పాల్గొన్నారు