విద్యా నైపుణ్యాలు గ్రంధాలయాల పాత్ర

నవతెలంగాణ – కంఠేశ్వర్  
నాగారంలోని తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ మహిళా కళాశాలలో లో జువాలజీ, కెమిస్ట్రీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయల సంస్థ చైర్మన్ డాక్టర్. రియాజ్ తో వెబినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమములో భాగముగా తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ ముఖ్య వక్తగా ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.విద్యార్థుల ఉద్దేశించి యువత జ్ఞాన సమర్థనకు మూలం పుస్తకాలు అని, ఉన్నత స్థానాలను సంపాదించి అభివృద్ధి చెందాలంటే దానికి ఆధారం గ్రంథాలయమని ,పుస్తకాలను ప్రతిరోజు చదవడం, రాయడం మొదలైన అభ్యాసన ద్వారా వారి భవిష్యత్తుకి ప్రణాళికలను వేసుకోవచ్చు అన్నారు . విద్యార్థులు అడిగిన సందేహాలకు సమాధానం చెప్పారు. వెబినార్ కార్య నిర్వాహకులు కెమిస్ట్రీ విభాగాధిపతులు  రమ్య, నవత ,హీనా, జువాలజీ విభాగాధిపతులు  సుమాంజలి, ప్రనూష. ప్రిన్సిపాల్ సైదా జైనబ్ వైస్ ప్రిన్సిపల్ వి.జి. లక్ష్మి విద్యార్థులు, అధ్యాపకులు మౌనిక , ప్రియాంక పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.