ప్రముఖ పారిశ్రామిక వేత్త,విద్యావేత్త ఏనుగు దయానంద్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను తొర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ… ఏనుగు దయానంద్ రెడ్డి నియోజకవర్గంలో ఎన్నో పాఠశాలలకు తన వంతుగా సహాయాన్ని అందించారని, అందులో భాగంగా మా తొర్తి పాఠశాలకు కూడా 80 వేల రూపాయలు విలువ గల డెస్కులు,బెంచీలు వితరణ చేశారని అన్నారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.